కల్కి డబుల్ ధమాకా @ రూ.375 కోట్లు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పాన్ వరల్డ్ మూవీ అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ప్రకటనతో పాటు ఇప్పటికే విడుదల అయిన గ్లిమ్స్ మరియు పోస్టర్స్ ఇది ఓ ఇండియన్ సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమాలా ఉంది అనే టాక్ మొదలు అయ్యింది.
కల్కి సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ ఆ రేంజ్ లోనే జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను ఎన్నికలు, ఐపీఎల్ ఇతర కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. జూన్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటన వచ్చింది.
విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని బిజినెస్ లు క్లోజ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీ డీల్ ను చిత్ర నిర్మాతలు క్లోజ్ చేశారు అంటూ సమాచారం అందుతోంది. సినిమా బడ్జెట్ లో సగం కంటే ఎక్కువ ఓటీటీ బిజినెస్ ద్వారా వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ను బట్టి అర్థం అవుతుంది.
చిత్ర యూనిట్ సభ్యులు చాలా తెలివిగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను రెండుగా విడదీసి అమ్మడం జరిగిందట. హిందీ వర్షన్ తో పాటు ఉత్తరాది భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు గాను రూ.175 కోట్ల కు గాను నెట్ ఫ్లిక్స్ కు అమ్మేయడం జరిగింది. ఇక సౌత్ లోని అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను రూ.200 కోట్లకు గాను అమెజాన్ కు అమ్మేయడం జరిగిందట.
రెండు ఓటీటీలు కలిపి కల్కి సినిమా నిర్మాతలకు ఏకంగా రూ.375 కోట్ల ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ఓటీటీ బిజినెస్ దక్కించుకున్న సినిమా లేదు అనడంలో సందేహం లేదు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరియు సినిమా కు వచ్చిన ప్రీ రిలీజ్ బజ్ కారణంగా ఈ స్థాయి బిజినెస్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీతో పాటు ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు, కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ నటించడం వల్ల అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా కల్కి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయం అంటున్నారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా వచ్చాయి అంటూ మేకర్స్ తో పాటు ప్రొడక్షన్ టీం చెబుతున్నారు. ఒక కొత్త ప్రపంచంలోకి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకు వెళ్లడంతో పాటు మంత్రముగ్దులను చేయడం ఖాయం అని వారు చెబుతున్నారు. అందుకే అన్ని చోట్ల కూడా రికార్డ్ స్థాయి బిజినెస్ జరుగుతోంది.