కల్కి2898ఏడీ… హిందీలో లెక్క ఎలా ఉందంటే..
డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషలలో కలెక్షన్స్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది
డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషలలో కలెక్షన్స్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకొని లాభాల బాటలో నడుస్తోన్న కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. థియేటర్స్ లో మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ పాన్ వరల్డ్ మూవీకి నార్త్ ఇండియన్ బెల్ట్ లో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
కల్కి 2898ఏడీ మూవీ హిందీ వెర్షన్ కి ఇప్పటి వరకు 250+ కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్రేడ్ పండితులు కన్ఫర్మ్ చేశారు. హిందీ మార్కెట్ లో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన డబ్బింగ్ మూవీగా కల్కి మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా కూడా కల్కి 2898ఏడీ నిలవడం విశేషం.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో బాలీవుడ్ ఆడియన్స్ కల్కిని మా సినిమా అనే ఫీలింగ్ తో చూసారు. అలాగే సినిమాలో ఉన్న మైథలాజికల్ ఎడాప్షన్ కి సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ చెప్పిన విధానం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఈ కారణంగానే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ కి హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అయ్యింది. దీంతో ఒక వర్గం ఆడియన్స్ షారుఖ్ ఖాన్ సినిమా చూడటానికి ఇష్టపడ్డారు.
జులై 12న అక్షయ్ కుమార్ సర్ఫిరా, కమల్ హాసన్ హిందుస్థాన్ 2 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే కల్కి మూవీ కలెక్షన్స్ పరంగా శుక్ర, శనివారాలు ఆ రెండింటి కంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది. శుక్రవారం కల్కి మూవీ 4.25 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తే శనివారం 7.95 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సర్ఫిరా స్ట్రైట్ హిందీ సినిమాగా రిలీజ్ అయ్యింది. అయిన కూడా శనివారం కల్కి కంటే తక్కువ కలెక్షన్స్ ని సాధించింది. అలాగే కమల్ హాసన్ హిందుస్థాన్ 2 మూవీ కల్కి దరిదాపుల్లోకి రాలేదని టాక్ వినిపిస్తోంది.
కల్కి 2898ఏడీ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ ని రాబట్టడంతో దీనికి సీక్వెల్ గా రాబోయే కల్కి 2898ఏడీ పార్ట్ 2పైన అంచనాలు పెరిగాయి. కచ్చితంగా ఆ మూవీ హిందీ వెర్షన్ 500+కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.