అప్పుడే 'కల్కి' ఓటీటీ...!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తున్న విషయం తెల్సిందే
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తున్న విషయం తెల్సిందే. సినిమా విడుదలకు ముందే మేకర్స్ ఈ సినిమాను 50 రోజులు పూర్తి అయ్యే వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసేది లేదు అంటూ తేల్చి చెప్పారు.
సినిమా చూడాలి అనుకున్న వారు అంతా కూడా థియేటర్ లో చూడాల్సిందే.. ఓటీటీ లో వచ్చేందుకు చాలా సమయం పడుతుందని మేకర్స్ పదే పదే చెప్పినప్పటికి థియేటర్లకు వెళ్లి అంతంత డబ్బులు ఖర్చు చేయలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో అంటూ వారు ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి ని డిజిటల్ ప్రపంచంలో చూడాలి అంటే 8 వారాలు ఆగాల్సిందేనట. ఇప్పటికే అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్స్ లతో ఒప్పందాలు చేసుకున్న మేకర్స్ 8 వారాల లోపు స్ట్రీమింగ్ చేయకూడదు అంటూ కండీషన్ పెట్టిందట.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కల్కి సినిమాను చూడాలి అనుకున్న వారు అమెజాన్ ప్రైమ్ లో చూడాల్సి ఉంటుంది. హిందీ వర్షన్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా ఒకే సారి కల్కి సినిమాను స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందాలు జరిగాయని సమాచారం అందుతోంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆగస్టు 15న కల్కి సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెలకు పైగా సమయం ఉంది. అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కల్కి వసూళ్లు తగ్గడంతో పాటు, ఫుల్ రన్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆగస్టు 15 కచ్చితంగా వస్తుందనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో అమితాబచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇంకా ఎంతో మంది ప్రముఖులు చిన్న పాత్రల్లో కనిపించారు. సినిమా మూడు గంటల నిడివితో ఉన్నా కూడా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
మొదటి వారం రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కల్కి సినిమా మొన్న సోమవారం నుంచి కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. మళ్లీ వీకెండ్ వరకు ఈ సినిమా పుంజుకుంటే రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.