ప్రభాస్ తో యువ కెరటాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా, హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా ఉన్నాడు

Update: 2024-05-29 05:04 GMT
ప్రభాస్ తో యువ కెరటాలు
  • whatsapp icon

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా, హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా ఉన్నాడు. అతనితో సినిమా అంటే నిర్మాతలు కూడా 300+ కోట్లకి పైగా బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులు ప్రభాస్ తో మూవీస్ చేయడం కోసం పోటీ పడుతున్నారు. సరైన కంటెంట్ పడితే వెయ్యి కోట్లు కలెక్ట్ చేయగల సామర్ధ్యం టాలీవుడ్ లో కేవలం ప్రభాస్ కి మాత్రమే ఉంది.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. జూన్ 27న ఈ చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మొట్టమొదటి పాన్ ఇండియా హీరోగా బాహుబలితో అరుదైన ఘనత సొంతం చేసుకున్న డార్లింగ్ కల్కితో మొట్టమొదటి పాన్ వరల్డ్ హీరోగా మరో గౌరవం దక్కించుకోబోతున్నాడు.

ఇంత పెద్ద స్టార్ అయిన కూడా ప్రభాస్ టాలెంటెడ్ యంగ్ దర్శకులకి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడంలో ముందుంటాడనే అభిప్రాయం అందరిలో నెలకొని ఉంది. రన్ రాజా రన్ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ కి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించారు. సుజిత్ సాహో మూవీ ప్రభాస్ తో చేశాడు. అయితే సక్సెస్ అందుకోలేకపోయారు. జిల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణకి డార్లింగ్ అవకాశం ఇచ్చాడు.

రాధాకృష్ణ ప్రభాస్ కి రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. అలాగే రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ తో ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో కల్కి చేస్తున్నాడు. గతంలో మాస్, స్టైల్, డాన్ సినిమాలతో సత్తా చాటిన లారెన్స్ కి ప్రభాస్ రెబల్ తో అవకాశం ఇచ్చాడు. అతను కూడా డార్లింగ్ కి డిజాస్టర్ ఇచ్చారు. రైటర్ గా ఉన్న కొరటాల శివకి ఛాన్స్ ఇవ్వగా మిర్చితో అతను బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

అలాగే వంశీ పైడిపల్లికి మున్నా సినిమాతో దర్శకుడిగా ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు సీతారామం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపూడి టాలెంట్ ని ప్రభాస్ గుర్తించాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో అతను చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది.

ఇక మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విధంగా యువ దర్శకులకు ప్రభాస్ బిగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఎవరి దగ్గర అయిన టాలెంట్ ఉందని నమ్మితే కచ్చితంగా ప్రభాస్ వారితో సినిమా చేస్తాడు. ఒకవేళ ఫ్లాప్ అయిన వారికి అండగా నిలబడతాడు అనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో ఉంది.

Tags:    

Similar News