'కల్కి 2898 AD' ట్రైలర్ వీక్షించిన మొదటివాడు
అయితే అంతకంటే ముందే కల్కి ట్రైలర్ ఎలా ఉంది? అన్నదానిపై ప్రీ టెస్ట్ పూర్తవుతోందని సమాచారం. కల్కి 2898 పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను ఇప్పటికే కొందరి కోసం ప్రదర్శించారు.
ప్రభాస్ నటించిన 'సలార్' గ్రాండ్ సక్సెస్ సాధించగా, అతడి నుంచి రానున్న మరో భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాల షూటింగులను పూర్తి చేస్తూ అందరినీ కన్ఫ్యూజన్ లోకి నెట్టాడు. అయితే నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' రిలీజ్ విషయంలో తొలి నుంచి స్పష్ఠంగా ఉన్నాడు. ఒకవేళ ఈ భారీ బడ్జెట్ చిత్రం రిలీజ్ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే ముందే హింట్ ఇచ్చేసి, ఒక ఫిక్స్ డ్ తేదీతో ఇప్పుడు నమ్మకంగా రిలీజ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. కల్కి మే 9న ముందే చెప్పిన తేదీకే విడుదల కానుంది.
అయితే అంతకంటే ముందే కల్కి ట్రైలర్ ఎలా ఉంది? అన్నదానిపై ప్రీ టెస్ట్ పూర్తవుతోందని సమాచారం. కల్కి 2898 పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను ఇప్పటికే కొందరి కోసం ప్రదర్శించారు. ప్రభాస్ సహా ఇతర తారాగణం, సిబ్బంది, పరిశ్రమలోని కీలక వ్యక్తుల కోసం ట్రైలర్ ని ప్రదర్శించినట్లు సమాచారం. త్వరలో గ్రాండ్ రివీల్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఇది పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కల్కి థీమ్ ని ప్రజల్లోకి ముందే తీసుకెళ్లేలా పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ని తీర్చిదిద్దారు. అలాగే ట్రైలర్ ని అన్ని భాషల్లోను విడుదల చేస్తారని తెలిసింది. ప్రస్తుతం చిత్రబృందం సహా ప్రముఖుల ఫీడ్‌బ్యాక్ ప్రభావం ఆధారంగా ట్రైలర్ తుది వెర్షన్ ఎంపిక చేస్తారని కూడా తెలిసింది.
నిజానికి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం 'కల్కి' రిలీజ్ చెప్పిన సమయానికి సాధ్యపడకపోవచ్చని, కొత్త రిలీజ్ తేదీ ప్రకటిస్తారని గుసగుసలు వినిపించాయి. సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందించిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ సహా ఇతర కార్యక్రమాల కోసం సమయం సరిపోవడం లేదని, అందుకే ఈ చిత్రం వాయిదా పడనుందని టాక్ వినిపించింది. కానీ నాగ్ అశ్విన్ ప్రయత్నాలు చూస్తుంటే రిలీజ్ విషయంలో తగ్గేదే లే అంటూ చెప్పిన టైముకే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారని అర్థమవుతోంది. ట్రైలర్ తో పాటు కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారని కూడా ఊహాగానాలు సాగాయి. కానీ మే 11న ఈ సినిమా విడుదల ఆగదని ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తోంది.
సైన్స్ ఫిక్షన్- ఫాంటసీ నేపథ్యంలోని ఈ సినిమా కథాంశం ఇప్పటికే రివీలైంది. భవిష్యత్ ప్రపంచం నేపథ్యంలో ఊహాతీతమైన విజువల్ ప్రపంచాన్ని నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందాలు పెద్దతెరపై ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. భవిష్యత్ విశ్వంలోని ఆవరణల నేపథ్యంలో ఫిక్షన్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంపై అటు హిందీ పరిశ్రమలోను ఆసక్తి నెలకొంది. రాబోవు ట్రైలర్ అంచనాలను మరింత పెంచడం ఖాయం.