అర్జున్ S/O వైజయంతి.. పర్ఫెక్ట్ టైమింగ్ లో..
అదే సమయంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.;

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. తన అప్ కమింగ్ మూవీ అర్జున్ S/O వైజయంతితో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో సీనియర్ కమ్ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్నారు. తొలిసారి కళ్యాణ్ రామ్, విజయశాంతి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

తల్లీ కొడుకుల మధ్య ఆకర్షణీయమైన సెంటిమెంట్ తో కూడిన థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న అర్జున్ S/O వైజయంతి మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనౌన్స్మెంట్ నుంచే బజ్ క్రియేట్ అవగ్గా.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
అయితే సినిమా కోసం ఇప్పుడు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రీతిలో జరిగినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యుత్తమ రేట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో మూవీపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
అదే సమయంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. రిలీజ్ డేట్ నిరీక్షణకు ముగింపు పలికారు. దాంతోపాటు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ కు సిద్ధంగా ఉన్న కళ్యాణ్ రామ్.. భారీ వెపన్ తో మెట్లపై కూర్చున్నారు.
మొత్తానికి కళ్యాణ్ రామ్ ఆవేశపూరిత లుక్.. సినిమాపై ఆసక్తి రేపుతోంది. పోస్టర్ లో ఉన్న స్పెషల్ సీక్వెన్స్ హై ఆక్టేన్, గూస్ బంప్స్ ను ప్రేరేపిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి పోస్టర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్డేట్ అదిరిపోయిందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ లుక్ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు.
అయితే టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ లో ఇదే పెద్ద రిలీజ్ అని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ రిలీజ్ గా చెబుతున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. భారీగా మూవీని ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముప్పా అశోక్ చౌదరి, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తున్న అర్జున్ S/O వైజయంతి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.