NKR 21 క్రేజీ అప్డేట్.. ఆ మూడు సీక్వెన్సెస్ అదుర్స్..

అయితే రీసెంట్ గా మేకర్స్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైజాగ్ లో కీలక షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు తెలిపారు.

Update: 2024-12-18 08:28 GMT

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చివరగా డెవిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. అనుకున్న స్థాయిలో మెప్పించలేక పోయారు. ఇప్పుడు NKR 21 సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్లే కష్టపడుతున్నారు.

అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NKR 21 ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అందులో కళ్యాణ్ రామ్ కొత్త గెటప్ లో కనిపించారు. పవర్ ఫుల్ రోల్ లో సినిమాలో అలరించనున్నట్లు తెలుస్తోంది. హై బడ్జెట్ ఎంటర్టైనర్ అని విజువల్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

అయితే రీసెంట్ గా మేకర్స్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైజాగ్ లో కీలక షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. అక్కడ పలు ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేసినట్లు చెప్పారు. మొత్తం 15 రోజుల పాటు ఫిక్స్ చేసిన వైజాగ్ షూటింగ్ షెడ్యూల్ లో మెయిన్ క్యాస్టింగ్ అంతా పాల్గొన్నారు. ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తైనట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ చివరి కల్లా సినిమా షూటింగ్ కు మేకర్స్ గుమ్మడి కాయ కొట్టనున్నారని సమాచారం. సీనియర్ నటి విజయశాంతి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర.. సినిమాకు హైలైట్ గా నిలవనుందని వినికిడి.

మూవీలో మూడు యాక్షన్ సీక్వెన్సెస్.. అదిరిపోనున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటి కోసం మేకర్స్ భారీగా ఖర్చు పెట్టినట్టు టాక్ వస్తోంది. ప్రముఖ స్టంట్‌ డైరెక్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ అద్భుతంగా డీల్ చేశారని సమాచారం. మరి NKR 21 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో.. యాక్షన్ సీక్వెన్సులు ఎలా మెప్పిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News