కళ్యాణ్ రామ్ కి పోటీగా మహేష్..!
ఐతే ఏప్రిల్ 18న కళ్యాణ్ రామ్ సినిమా వస్తుంటే నెక్స్ట్ డే ఏప్రిల్ 19న సూప్ర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేశారు.;

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా నటించింది. టీజర్ తో మెప్పించిన ఈ సినిమా ఆడియన్స్ కు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ని తీసుకొస్తున్నారు.
ఐతే ఏప్రిల్ 18న కళ్యాణ్ రామ్ సినిమా వస్తుంటే నెక్స్ట్ డే ఏప్రిల్ 19న సూప్ర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా డీసెంట్ హిట్ సాధించింది. సినిమాలో మహేష్ సీఎంగా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. సిస్టెం బాగుంటేనే ప్రజలు కూడా బాగుంటారన్న కాన్సెప్ట్ తో కొరటల శివ కాన్సెప్ట్ అదిరిపోయింది.
అప్పటికే శ్రీమంతుడు సినిమాతో మహేష్, కొరటాల శివ కాంబో క్రేజ్ సంపాదించింది. మళ్లీ అదే కాంబోలో వచ్చిన భరత్ అనే నేను కూడా సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ సినిమాకు పోటీగా మహేష్ సూపర్ హిట్ సినిమా దించడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో మహేష్ భరత్ అనే నేను ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈసారి నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ సినిమాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఎన్ టీ ఆర్ కూడా ఈవెంట్ కి వచ్చి ఫ్యాన్స్ ని ఉత్సాహపరచాలని చూస్తున్నాడు. సో కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న క్రేజీ మూవీగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. ఐతే పోటీగా మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ అవ్వడం సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అన్నది చూడాలి. నందమూరి హీరో మాత్రం సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఐతే రీ రిలీజ్ సినిమాతో రిలీజ్ సినిమాకు పోటీ ఏంటని కొందరు అంటున్నా కళ్యాణ్ రామ్ సినిమాకు భరత్ అనే నేను రీ రిలీజ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.