బాలీవుడ్‌ స్టార్‌ సోహైల్‌ ఫస్ట్‌ టాలీవుడ్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌!

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయి

Update: 2024-12-20 10:22 GMT

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయి. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవల నిర్మాత కళ్యాణ్ రామ్‌ ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్‌ కెరీర్‌ లో 21వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లో గతంలో నటించినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. కానీ ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు దక్కే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ అంటున్నారు.

కళ్యాణ్‌ రామ్‌తో పాటు ఈ సినిమాలో లేడీ అమితాబ్‌ బచ్చన్‌గా పేరున్న సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సోహైల్‌ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలను షేర్‌ చేశారు. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కళ్యాణ్‌ రామ్‌ ను ఢీ కొట్టే విలన్‌ పాత్రలో సోహైల్‌ ఖాన్‌ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. సినిమాలోని ఆయన లుక్‌ను బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసి ప్రత్యేకంగా యూనిట్‌ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించారు. ఆ షెడ్యూల్‌లో కళ్యాణ్‌ రామ్‌తో పాటు సోహైల్‌ ఖాన్‌లు పాల్గొన్నారు. సినిమాలోని కీలక సన్నివేశాల షూటింగ్‌ పూర్తి అయ్యిందని, విజయశాంతిపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, హీరో, హీరోయిన్‌లపై సాంగ్స్, కొన్ని యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేస్తే సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లే అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాలో మంచి కథ ఉంటుందని, అందుకు తగ్గట్టుగా ప్రముఖ నటీనటులను ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థకు చెందిన వారు చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు ప్రముఖ రచయిత శ్రీకాంత్‌ విస్సా స్క్రీన్‌ప్లే అందిస్తున్న కారణంగా అంచనాలు మరింతగా పెరిగాయి. పుష్ప 2 కోసం శ్రీకాంత్‌ విస్సా వర్క్ చేశారు. ఆయన గురించి దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనుక శ్రీకాంత్‌ విస్సా కారణంగా కళ్యాణ్ రామ్‌ ఈ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయశాంతి చాలా కాలం తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. మరి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

Tags:    

Similar News