నందమూరి హీరోకి మరో పటాస్ పడాల్సిందే..!

పటాస్ తో అనిల్ రావిపూడి మీద కళ్యాణ్ రామ్ నమ్మకమే ఆ సినిమా సక్సెస్ కు కారణమైంది.

Update: 2025-01-23 09:40 GMT

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో కళ్యాణ్ రామ్ పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడంటే అనిల్ రావిపూడి ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కానీ పటాస్ సినిమా మొదటి ప్రాజెక్ట్. కథ చెప్పిన దాన్ని బట్టే అతని మీద నమ్మకం ఉంచాలి. పటాస్ తో అనిల్ రావిపూడి మీద కళ్యాణ్ రామ్ నమ్మకమే ఆ సినిమా సక్సెస్ కు కారణమైంది. ఆ సినిమా కళ్యాణ్ రాం కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది.


ఐతే పటాస్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణ్ రామ్ కూడా తన సోషల్ మీడియాలో మెసేజ్ చేశారు. 2025 చాలా స్పెషల్ కాబోతుందని.. పటాస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడికి బిగ్ థాంక్స్.. ఆ సినిమా ఇచ్చిన వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ తో సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్. మీ ప్రేమను ఇలానే పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు.

ఐతే పటాస్ 10 ఏళ్ల పండగ టైం లో నందమూరి ఫ్యాన్స్ అనిల్ తో మరో సినిమా ప్లాన్ చేయమని కళ్యాణ్ రాం ని అడుగుతున్నారు. మళ్లీ పటాస్ లాంటి సినిమా పడితే కళ్యాణ్ రామ్ కెరీర్ ఊపందుకుంటుందని చెప్పొచ్చు. ఈమధ్య కళ్యాణ్ రామ్ సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కావట్లేదు. ఎలాగు తొలి ఛాన్స్ ఇచ్చిన హీరో కాబట్టి కళ్యాణ్ రామ్ అడిగితే అనిల్ రావిపూడి కాదనే ఛాన్స్ ఉండదు. సో అనిల్, కళ్యాణ్ రామ్ కాంబో మరో సినిమా వస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

పటాస్ తో మొదలు పెట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు చేసిన 8 సినిమాలు సక్సెస్ అందుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సెపరేట్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత అయినా కళ్యాణ్ రాం తో సినిమా ఉంటుందేమో చూడాలి.

Tags:    

Similar News