కేసుల వేద‌నతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న క్రిటిక్

బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ త‌న సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఏదో ఒక వివాదాస్ప‌ద అంశాన్ని ప్ర‌స్థావిస్తున్నాడు.

Update: 2025-02-26 02:45 GMT

బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ త‌న సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఏదో ఒక వివాదాస్ప‌ద అంశాన్ని ప్ర‌స్థావిస్తున్నాడు. అత‌డి వ్యంగ్య వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టికే చాలామంది హీరోలు హ‌ర్ట‌య్యారు. అత‌డిపై చాలా మంది పోలీస్ కేసులు పెట్టారు. ఈ జాబితాలో న‌టుడు ధ‌నుష్ కూడా ఉన్నారు.

2017 - 2024 మధ్య తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడు క‌మ‌ల్ ఆర్.ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ త‌న‌ను తాను `నిర్దోషి` అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ముంబయి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌లలో ఒకటి నటుడు ధనుష్ కి చెందిన‌ది. ధ‌నుష్, అతడి సహ నటులపై కేఆర్కే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు.

2017లో ఒక అస‌భ్య‌క‌ర పోస్ట‌ర్ ని షేర్ చేసిన క‌మ‌ల్ ఆర్.ఖాన్ .. ఏ స్త్రీ అయినా దక్షిణాది నటుడు ధనుష్ ను తనను తాకడానికి ఎలా అనుమతించగలదు? అని కేఆర్కే ప్రశ్నించారు. ఈ కామంట్ తో `ఒక మహిళ అణకువను అవమానించినందుకు` అసభ్యకరమైన ఫోటోని షేర్ చేసినందున అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే, ఖాన్ తన పిటిషన్‌లో `ట్వీట్ చేసాన‌న‌డానికి ఎలాంటి రుజువు లేదు`` అని వాదిస్తూ, ఆ వాదనలను తోసిపుచ్చారు. 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా కానీ ఆ విషయం త‌న‌కు 2020లోనే తెలియజేశారని ఆయన ఎత్తి చూపారు. ఈ విషయం పరిష్కారం అయ్యే వరకు తనపై ఉన్న అన్ని చట్టపరమైన చర్యలను నిలిపివేయాలని ఆయన అభ్యర్థించారు. కోర్టు త్వరలో కేసును విచారించే అవకాశం ఉంది.

మరో కేసులో 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖాన్ తన లైసెన్స్ ఉన్న తుపాకీని తిరిగి ఇవ్వ‌నందుకు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఆయుధాన్ని తీసుకునేందుకు ముంబై పోలీసులు వచ్చినప్పుడు అతడి ఇంటికి తాళం వేసి ఉండటంతో, అతనిపై చార్జిషీట్ దాఖలు చేసారు. లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేయబడింది. అయితే హైకోర్టు విచారణ తర్వాత, ఖాన్ తన తుపాకీని డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత సర్క్యులర్ రద్దు అయింది. తన పిటిషన్‌లో తాను 2008లో ఆత్మరక్షణ కోసం తుపాకీని పొందానని, 2024 వరకు దానిని అప్పగించమని ఎప్పుడూ అడగలేదని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఆయుధాన్ని డిపాజిట్ చేయమని ఆదేశించినప్పుడు తాను లండన్‌లో ఉన్నానని, అందువల్ల తాను దానిని పాటించలేకపోయానని ఆయన పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ ఖాన్ హైకోర్టును ఆశ్రయించడం ఇదే మొదటిసారి కాదు. అతను గతంలో మరొక కేసులో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు త‌న‌పై కేసులు ఎత్తేయాల్సిందిగా పిటిషన్‌ను దాఖలు చేశాడు. అయితే అది ఇంకా తుది విచారణకు రాలేదు.

Tags:    

Similar News