సగం వయసు హీరోయిన్‌తో.. భుజం తడుముకున్న హీరో!
సికందర్ స్టార్లు సల్మాన్- రష్మిక జంట మధ్య వయసు తేడా గురించి చాలా చర్చ సాగుతోంది.;

సికందర్ స్టార్లు సల్మాన్- రష్మిక జంట మధ్య వయసు తేడా గురించి చాలా చర్చ సాగుతోంది. సల్మాన్ వయసు 59 సంవత్సరాలు.. రష్మిక వయసు 28 సంవత్సరాలు.. సగం కంటే ఎక్కువ వయసు తేడా ఉంది. పరిశ్రమలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. అయితే దీనిని విశ్వనటుడు కమల్ హాసన్ తోసి పుచ్చారు. హీరోయిన్‌కి ఎటువంటి సమస్య లేకపోతే.. హీరోయిన్ తల్లి లేదా తండ్రికి ఎటువంటి సమస్య లేకపోతే, మీకు ఏంటి సమస్య? ఆమె (రష్మిక) వివాహం చేసుకుని ఒక కుమార్తెను కన్నప్పుడు, ఆమె పెద్ద స్టార్ అయినప్పుడు, మేము కూడా (కలిసి) పని చేస్తాము. మేము తప్పనిసరిగా ఆమె తల్లి అనుమతి పొందుతాము.. అని అన్నారు.
60లు 70లలో ఉన్న మన సూపర్‌స్టార్‌లను రెగ్యులర్‌గా అడిగే ప్రశ్న కమల్ హాసన్ కి ఎదురైంది. కమల్ హాసన్ ని చాలా కాలం క్రితమే జాతీయ మీడియా వయసు వ్యత్యాసం గురించి ప్రశ్నించింది. నిజానికి 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నటులు దక్షిణాది సినిమాల్లో హీరోగా కొనసాగుతున్నారా? అని ప్రశ్నించగా, హాలీవుడ్ స్టార్ల వయసు గురించి ప్రస్థావించారు. క్లింట్ ఈస్ట్‌వుడ్, చార్లెస్ బ్రాన్సన్, క్యారీ గ్రాంట్, అమితాబ్ బచ్చన్ లను ఉదాహరణలుగా చూపించారు. నిజానికి దిలీప్ (కుమార్) సాబ్ తన 40ల మధ్యలో ఉన్నప్పుడు రామ్ ఔర్ శ్యామ్ పాత్రను పోషించారు. కాబట్టి మనం ప్రయాణించగలిగినంత వరకు వెళ్లాలి! అని కమల్ హాసన్ అన్నారు. నేను చేయగలిగేది 50లలో ఉన్నప్పుడు కాలేజ్ విద్యార్థి పాత్రను పోషించనని అన్నారు.
సగం వయసున్న హీరోయిన్లతో ప్రేమలో పడితే ఎలా? అని ప్రశ్నించగా, నిజ జీవితంలోను నేను ఇలా చేయగలను. అది అంత కష్టం కాదు. కళ జీవితాన్ని అనుకరిస్తుంటే అది చాలా సాధ్యమే. ఒనాసిస్ (నటుడు) తన వయసులో సగం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. తనకు 60 వచ్చినా తన పాత్రలు వయసుకు తగ్గట్టే తీర్చిదిద్దారని తెలిపారు. చాలా చిన్నవాడిగా నటించడం లేదని, చిన్న వయసు నటీమణులతో నటించడానికి అభ్యంతరం లేదని అన్నారు.