కమల్ 'థగ్ లైఫ్'.. ఎక్కడి వరకు వచ్చింది?
విలక్షణ నటుడు కమల్ హాసన్.. ఫుల్ జోష్ మీద ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
విలక్షణ నటుడు కమల్ హాసన్.. ఫుల్ జోష్ మీద ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని అలరిస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీలో సుప్రీమ్ యాస్కిన్ రోల్ లో నటించారు. సినిమాలో కొద్ది సేపే కనిపించినా.. ఓ రేంజ్ లో మెప్పించారు. తన గెటప్ తో ఒక్కసారిగా భయపెట్టారు. సీక్వెల్ లో ఆయన రోల్ ఫుల్ లెంగ్త్ లో ఉండనుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు.
రీసెంట్ గా భారతీయుడు-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్.. తన నటనతో ఆకట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ వంటి హిట్ తర్వాత మణిరత్నం తీస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో ఇప్పటికే మణిరత్నం, కమల్ హాసన్ కాంబో 36 ఏళ్ల క్రితం రిపీట్ అయిన విషయం తెలిసిందే.
1987లో కమల్ హీరోగా మణిరత్నం నాయగన్ మూవీ తెరకెక్కించారు. తెలుగులో నాయకుడుగా డబ్ అయిన ఆ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల వారిద్దరూ కలిసి వర్క్ చేయలేదు. అనేక ఏళ్ల తర్వాత వారి కాంబోలో థగ్ లైఫ్.. రాబోతుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ చిత్రంలో కమల్ మూడు భిన్న కోణాలున్న పాత్రల్లో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2024 జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. రీసెంట్ గా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. ఇటీవల కమల్ తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేశారట. త్వరలో రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కమల్ చేతిలో ఉన్న భారతీయుడు-3 కన్నా ముందే థగ్ లైఫ్.. ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక థగ్ లైఫ్ సినిమా విషయానికొస్తే.. భారీ బడ్జెట్ తో రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష, శింబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, పంకజ్ త్రిపాఠి, అభిరామి, గౌతమ్ కార్తీక్, నాజర్ తదితరులు యాక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరి థగ్ లైఫ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.