.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

సేనాప‌తి గురించి క‌మ‌ల్ ఏమ‌న్నారంటే?

తాజాగా ఈ అంశాల‌న్నింటిపై క‌మ‌ల్ హాస‌న్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌యత్నం చేసారు. ట్రైల‌ర్ రిలీజ్ అయిన నాటి నుంచి ర‌క‌ర‌కాల క‌థ‌నాలొస్తున్నాయి.

Update: 2024-06-29 10:30 GMT

'ఇండియ‌న్-2' రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఆస‌క్తి అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మఖ్యంగా ఎవ‌రి పాత్ర‌లు ఎలా ఉంటాయి? 104 ఏళ్ల వ‌య‌సులో సేనాప‌తి పాత్ర ఎలా ఉండ‌బోతంది? భార‌తీయుడు ఫీల్ ఈ సినిమాలో ఉంటుందా? ఉండ‌దా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు అభిమానుల బుర్ర‌ల్ని తొలిచేస్తున్నాయి.

తాజాగా ఈ అంశాల‌న్నింటిపై క‌మ‌ల్ హాస‌న్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌యత్నం చేసారు. ట్రైల‌ర్ రిలీజ్ అయిన నాటి నుంచి ర‌క‌ర‌కాల క‌థ‌నాలొస్తున్నాయి. అవినీతికి పాల్ప‌డిన అధికారులంద‌ర్నీ సిద్దార్ధ్ చంపేస్తాడ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంత మంది సేనాప‌తి గెట‌ప్ గురించి అడుగుతున్నారు. అయితే ఈ క‌థ‌నాలు ఏవి నిజం కాదు. సినిమా క‌థ‌ని ఎవ‌రూ ఊహించ‌లేరు. అందుకు నేను సంతోషిస్తున్నాను.

సేనాప‌తి పాత్ర ఎంత ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తుందో తెర‌పైనే చూడాలి. సినిమా అనే ప్ర‌పంచంలో ఇంత‌కు ముందెప్పుడు ఇలాంటి పాత్ర పుట్ట‌లేదు. చాలా కొత్త‌గా ఉంటుంది. భార‌తీయుడు సేనాప‌తికి ఇప్పుడు సేనాప‌తికి చాలా వ్య‌త్యాసం ఉంటుంది. క‌థ గురించి ప్రేక్ష‌కులంతా ఎవ‌రి ఊహాల్లో వాళ్లు ఉన్నారు. కానీ వాళ్లెవ్వ‌రు ఊహ‌కి అందని విధంగా క‌థ ఉంటుంది. పాత్ర‌లు అంతే ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ప్ర‌తీ పాత్ర‌లోనూ వైవిథ్యం ఉంటుంది. ఓ ఫ్రెష్ ఫీలింగ్ క‌లుగుతుంది' అని అన్నారు.

Read more!

ఇక సినిమాలో సేనాప‌తి పాత్ర 104 ఏళ్ల వ‌య‌సులోనే అంతే దూకుడుగా ఉంటుంద‌ని శంక‌ర్ రివీల్ చేసారు. ఆ వ‌య‌సులో ఎవ‌రైనా మార్ష‌ల్ ఆర్స్ట్, ఫైటింగ్ లు చేయ‌గ‌ల‌రా? అన్న సందేహా ప‌రులంద‌రికీ శంక‌ర్ క్లారిటీ ఇచ్చారు. చైనాలో ఇప్ప‌టికీ 104 నుంచి 108వయ‌సు గ‌ల ముస‌లి వాళ్లు ఎలా ఉన్నారో వివ‌రించారు. 104 ఏళ్ల వ‌య‌సులోనూ మార్ష‌ల్ ఆర్స్ట్ లో కుర్రాళ్ల‌ని మించి ట్రైనింగ్ ఇచ్చేవారు ఉన్నారు' అన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News