'విశ్వంభ‌ర' సెట్స్ లో సినిమాటోగ్ర‌ఫీ మంత్రి!

ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే మెగాస్టార్ చిరింజీవి నూత‌న మంత్రివ‌ర్గానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేసారు.

Update: 2024-06-20 06:04 GMT

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుతో మెగా ఫ్యామిలీ రెట్టించిన సంతోషంలో ఉంది. నారా చంద్ర‌బాబు నాయుడు నాల్గ‌వ‌సారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం ఒక ఎత్తైతే..చిరంజీవి సోద‌రుడు, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉప ఉమ‌ఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో మెగా ప్రేక్ష‌కాభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే మెగాస్టార్ చిరింజీవి నూత‌న మంత్రివ‌ర్గానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేసారు.

ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క మ‌రియు సినిమాటోగ్ర‌పీ శాఖ బాధ్య‌త‌ల్ని కందుల దుర్గేశ్ కి అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి 'విశ్వంభ‌ర' సెట్స్ కి చిరంజీవి దుర్గేష్ ని ఆహ్వ‌నించారు. దుర్గేశ్ ఆ సినిమా సెట్స్ కి వెళ్ల‌డంతో చిరంజీవి సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం భారీ పుష్ప గుచ్చం అందించి స్వాగ‌తించారు. అటుపై సాలువా క‌ప్పి స‌న్మానించారు. అనంత‌రం చిరంజీవి, దుర్గేష్ క‌లిసి ఫోటోలు దిగారు.

చిత్రబృందంలో కొంద‌రు స‌భ్యులు అక్క‌డ ఉండ‌టంతో మంత్రితో వాళ్లంతా కూడా ఫోటోలు దిగారు. అనంత‌రం చిరంజీవి-దుర్గేష్ కాసేపు సంభాషించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి సోష‌ల్ మీడియా వేదికగా స్పందించారు. 'మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌కు ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది.

మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నా. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను' అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News