ఆ సినిమా రిలీజ్ పై నీలి నీడలు తొలగేదెప్పుడు?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటి స్వీయా దర్శకత్వంలో నిర్మించిన `ఎమర్జెన్సీ` రిలీజ్ వివాదం ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటి స్వీయా దర్శకత్వంలో నిర్మించిన `ఎమర్జెన్సీ` రిలీజ్ వివాదం ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సహా సెన్సార్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెప్టెంబర్ 6న రిలీజ్ అవ్వాల్సిన సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది. రిలీజ్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులు సలహా తీసుకుంటుంది.
మరోవైపు శిరోమణి అకాలీ దళ్ పార్టీ కూడా రిలీజ్ అవ్వడానికి విల్లేదంటూ సెన్సార్ పై తీవ్ర ఒత్తిడి తీసు కొస్తుంది. లేఖల మీద లేఖలు రాస్తూ అడ్డుతగిలింది. ఇంకోవైపు ఓ వర్గం రిలీజ్ నిలిపివేయాలని మధ్య ప్రదేశ్ న్యాయస్థానాన్ని సంప్రదించింది. దీంతో అక్కడ నిరాశ తప్పలేదు. ఇప్పుడు రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో వీటన్నింటిపై కంగన బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.
అయితే మధ్యప్రదేశ్ ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని కంగనకి షాక్ ఇచ్చింది. కానీ ఈనెల 18 లోపు ఓ నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు మాత్రం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా వేసింది. దీంతో బంతి ఇప్పుడు సెన్సార్ చేతిలో ఉన్నట్లు అయింది. రిలీజ్ విష యంలో అభ్యంతరాల్ని కంగనకి చెప్పి వాటిని తొలగించే దిశగా డైరెక్ట్ చేయాల్సి ఉంది.
దానికి కంగన అంగీకరించాలి. లేదంటే న్యాయ పోరాటం తప్పదు. మరి ఈ పరిస్థితుల్లో కంగన చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందన్నది చూడాలి. కంగన ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వ పెద్దల నుంచి గానీ, పార్టీ నుంచి రిలీజ్ విషయంలో ఎలాంటి మద్దతు దక్కలేదు. అసలు కంగనని పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించలేదు.