సోనూసూద్‌తో కంగన వివాదానికి ముగింపు
ప్రతిసారీ తన కొత్త సినిమా విడుదల సమయంలో వివాదాస్పద అంశాలతో హెడ్ లైన్స్ లో నిలుస్తుంది కంగన.
క్వీన్ కంగన రనౌత్ ఎటాకింగ్ స్వభావం చాలా చిక్కుల్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ తన కొత్త సినిమా విడుదల సమయంలో వివాదాస్పద అంశాలతో హెడ్ లైన్స్ లో నిలుస్తుంది కంగన. ఇప్పుడు ఎమర్జెన్సీ రిలీజ్ సమయంలోను అందుకు భిన్నంగా లేదు. ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి కంగన పేరు వివాదాల్లో నలుగుతోంది.
ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో సినీ తారలతో తనకు ఉన్న స్నేహం, వారితో వివాదాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. క్వీన్ కంగనా చాలా మంది బాలీవుడ్ నటులు, దర్శకనిర్మాతలతో వివాదాలున్నాయని అంగీకరించింది. అలాగే నటుడు సోనూసూద్‌తో మణికర్ణిక సమయంలో తలెత్తిన వివాదం గురించి మాట్లాడింది.
ఇటీవలే కరణ్ జోహార్ తో వివాదం గురించి ప్రస్థావించిన కంగన అతడితో మళ్లీ కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే స్నేహం మాత్రం చేయనని తెగేసి చెప్పింది. అలాగే సోనూసూద్‌తో వివాదం గురించి కంగన ప్రస్థావించింది. 2019లో సోనూసూద్‌తో కలిసి 'మణికర్ణిక' చిత్రంలో కంగన నటించిన సంగతి తెలిసిందే. అయితే సెట్‌లో వారి మధ్య వివాదం తలెత్తడంతో సోనూ సినిమా నుంచి తప్పుకున్నాడు. అటుపై కంగనతో తాను మాట్లాడనని తన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తాజాగా కంగన అతడి పేరు చెప్పకుండానే... తనపై కోపంగా ఉన్న వ్యక్తులతో ప్రొఫెషనల్ గా సమస్యలేవీ లేవని, కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. మీరు ఎవరిని కలిసినా మీ స్నేహితుడిగా మారాల్సిన అవసరం లేదు. నాపై ఎవరు కోపంగా ఉన్నా తప్పేమీ లేదు. నేను చాలామంది భిన్నమైన ఆలోచనలు ఉన్న నటులతో పని చేసాను. వ్యక్తిగతంగా అవతలి వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా వృత్తిగతంగా కలిసి పని చేసేందుకు అభ్యంతరాలు లేవని కంగన అంది. ఎవరి గురించి అయినా తీర్పు చెప్పే హక్కు నాకు లేదు అని కూడా అంగీకరించింది.
స్వర భాస్కర్‌తో స్నేహం?
'తను వెడ్స్ మను' సహనటి స్వరాభాస్కర్ తో కంగన వివాదం గురించి తెలిసిందే. ఓ సందర్భంలో స్వరా డి గ్రేడ్ నటి అని కామెంట్ చేయగా, ఆ ఇద్దరి మధ్యా వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించారు. అదంతా అటుంచితే ఇప్పుడు 'తను వెడ్స్ మను 3'లో నటించేందుకు కంగన సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో వృత్తిగతంగా స్వరాతో పని చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించింది.
స్వర, నేను కలిసి పని చేయవచ్చు. అంతకుముందు కూడా తన ఆలోచన భిన్నంగా ఉండేది. స్వరా ఎప్పుడూ సెట్‌లో సోషలిజం, కమ్యూనిజం గురించే మాట్లాడేది. ఎవరైనా నటి ఇంటర్వ్యూ చూసి తనపై నా అభిప్రాయాన్ని ఏర్పరచుకోను. ఈ హక్కు వామపక్షాలది.. మనది కాదు... అని వ్యాఖ్యానించింది కంగన. 2020లో కంగనా, స్వరా మధ్య ట్విట్టర్‌లో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మాటల్లేవ్. కానీ ఇప్పుడు కంగన స్వరం మారింది. స్వరాతో కలిసిపోయి పని చేస్తానని అంటోంది. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ లో కంగన, స్వర కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. తను వెడ్స్ మను ఫ్రాంఛైజీలో మునుముందు కలిసి పని చేస్తారేమో చూడాలి.