కంగనా చెప్పిందంటే చేస్తుందని లెక్క..!
లేటెస్ట్ గా డైరెక్టర్స్ మీద ఎటాక్ చేస్తూ ఈ భూమ్మీదే అసలు మంచి డైరెక్టర్స్ లేరని అంటుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ అంటే అక్కడ స్టార్ హీరోలు కూడా షేక్ అవుతుంటారు. ఆన్ స్క్రీన్ యాక్టింగ్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా కథానాయికగా తన కామెంట్స్ తో అదరగొట్టేస్తుంది అమ్మడు. ఐతే కంగనా ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేసింది అంటే దాని గురించి అందరు చర్చించుకునేలా ఉంటుంది. లేటెస్ట్ గా డైరెక్టర్స్ మీద ఎటాక్ చేస్తూ ఈ భూమ్మీదే అసలు మంచి డైరెక్టర్స్ లేరని అంటుంది. అసలు కంగనా కి ఎందుకు సడెన్ గా డైరెక్టర్స్ మీద ఇంత కోపం వచ్చింది అంటే.
కథ ఎలాంటిదైనా సినిమా ఏదైనా అప్పుడు ఇప్పుడు మేల్ డామినేషన్ అన్నది కామన్ అయ్యింది. ఏవో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు తప్ప సినిమాల్లో హీరోయిన్స్ ఉన్నారంటే ఉన్నారు అనే చెప్పుకునేలా ఉంటున్నాయి. కొన్ని సినిమాలైతే కేవలం సాంగ్స్ వరకే హీరోయిన్స్ ఇక మిగతా సినిమా అంతా కూడా హీరోల వన్ మ్యాన్ షోనే అనేలా చేస్తున్నారు. ఈ విషయంపై కంగనా ఫైర్ అవుతుంది. సినిమాల్లో హీరోయిన్స్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని అంటుంది కంగనా రనౌత్.
సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత తగ్గింది. అందుకే తాను డైరెక్టర్ గా మారి కథకు కథానాయికే హీరోగా సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. సినిమాలు అసలు గ్లామర్ తెచ్చేది హీరోయిన్సే ఐతే అలాంటి వారిని కేవలం ప్రాధాన్యత లేని పాత్రలకే అంకితం చేస్తున్నారని వాపోతుంది కంగనా. అందుకే తాను మెగా ఫోన్ పట్టానని ఈ భూమీద ఎవరు మంచి డైరెక్టర్స్ లేరని చెప్పుకొచ్చింది కంగనా.
అంతకు ముందు మణికర్ణిక సినిమా టైం లో కూడా సినిమాను క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టి మధ్యలోనే కంగనా టేకోవర్ చేసుకుంది. ఇక లేటెస్ట్ గా ఆమె ఎమర్జెన్సీ సినిమాను డైరెక్ట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే డైరెక్టర్స్ హీరోయిన్స్ విషయంలో చేస్తున్న అన్యాయంపై గొంతు విప్పింది కంగనా. ఐతే కంగనా కామెంట్స్ చూసి కొందరు నిజమే అని భావించినా సినిమాకు మెయిన్ అసెట్ హీరోయిన్స్ కాదు హీరోలే అనుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా తన మనసులో మాటని ఎలాంటి మొహమాటం లేకుండా బయట పెట్టే కంగనా రనౌత్ కి అదుకే సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.