పెద్ద‌లు కుదుర్చిన పెళ్లిళ్ల‌పై కంగ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అప‌రిచితుల‌తో ప్రారంభ‌మైనా భార్య‌భ‌ర్త‌లు జీవితాంతం క‌లిసి ఉండే సంస్కృతి భార‌తీయ సంస్కృతి అని గ‌ర్వంగా ప్ర‌కటించారు కంగ‌న‌.

Update: 2025-02-28 14:30 GMT

వివాహం, పెళ్లి బంధంపై క్వీన్ కంగ‌న చేసిన ఘాటు వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. భారతదేశంలో మేము పెద్ద‌లు ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల‌తో అపరిచితులను వివాహం చేసుకుంటాము. 80 ఏళ్ల వయసులో కూడా చేతులు పట్టుకుని వాకింగ్‌కు వెళ్తాము. పాశ్చాత్య సంస్కృతి వైపు ఎప్పుడూ చూడకండి'' అని క్వీన్ కంగ‌న వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాలలో ప్రజలు డేటింగ్ యాప్‌లపై ఆధారపడతారని, ఎప్పటికీ ఉండని పరిపూర్ణ జత కోసం అనంతంగా వెతుకుతున్నారని ఆమె గమనించింది. అప‌రిచితుల‌తో ప్రారంభ‌మైనా భార్య‌భ‌ర్త‌లు జీవితాంతం క‌లిసి ఉండే సంస్కృతి భార‌తీయ సంస్కృతి అని గ‌ర్వంగా ప్ర‌కటించారు కంగ‌న‌.

అదే స‌మ‌యంలో పాశ్చాత్యుల పెళ్లి బంధం ఎలా ఉంటుందో ఒక ఉదాహ‌ర‌ణను చూపిస్తూ ప్ర‌ముఖ హాలీవుడ్ క‌పుల్ ని కంగ‌న తూల‌నాడారు. జెన్నిఫర్ లోపెజ్ - బెన్ అఫ్లెక్‌ల ఆన్-అగైన్, ఆఫ్-అగైన్ సంబంధాన్ని ప్రస్తావంచిన‌ కంగన పాశ్చాత్యులు మ‌న‌ల్ని అవ‌హేళ‌న చేస్తారు కానీ... అత్యంత తెలివైన, మంచిగా కనిపించే, విజయవంతమైన వ్యక్తులు - భూమిపై హాటెస్ట్ మ్యాన్ అని పిలవబడే బెన్ అఫ్లెక్ .. అత్యంత ధనవంతురాలు, గొప్ప పాప్ స్టార్లలో ఒకరైన జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటికీ వారి యాభైలలో పరిపూర్ణ భాగస్వామి కోసం వెతుకుతున్నారు'' అని వ్యాఖ్యానించారు.

మ‌ళ్లీ మ‌ళ్లీ పెళ్లి, పిల్ల‌ల త‌ర్వాతా ఇంకా ఇంకా ఆదర్శ భాగస్వామి కోసం వెతుకులాట నిజంగా ఎప్పుడైనా ముగుస్తుందా? అని పాశ్చాత్యుల‌ను కంగ‌న‌ ప్రశ్నించింది. ఈ జంట‌ యాభైలలో ఉన్నారు.. మళ్ళీ విడాకులు తీసుకున్నారు. ఇంకా భాగ‌స్వామి కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిపింది. సంబంధాలు- వివాహంపై కంగనా బలమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల బాలీవుడ్ లో ప్రేమ‌క‌థ‌లు, కుటుంబ క‌థ‌ల‌ను తెర‌కెక్కించే విధానాన్ని కూడా కంగ‌న‌ వ్యతిరేకించింది.

కంగనా న‌టించిన 'ఎమర్జెన్సీ' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయితే త‌దుప‌రి ఆర్. మాధవన్‌తో తిరిగి కలిసి నటించబోతోంది. 'తను వెడ్స్ మను' కెమిస్ట్రీని తిరిగి రిపీట్ చేస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News