స్టార్‌ హీరోయిన్‌ ట్రిపుల్‌ రోల్‌

సెన్సార్ బోర్డ్‌ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే సినిమాను విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.

Update: 2024-10-06 11:30 GMT

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌ గానే కాకుండా ప్రస్తుతం ఈమె ఎంపీగా సైతం విధులు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ మెంబర్ గా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్ సినిమాలను లైట్ తీసుకోవడం లేదు. వరుసగా సినిమాలను చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. సెన్సార్ బోర్డ్‌ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే సినిమాను విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.

కంగనా ఎమర్జెన్సీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్‌ హ ఇట్‌ అందుకున్న సినిమా 'తను వెడ్స్‌ మను'. ఆ సినిమా సూపర్‌ హిట్‌ నేపథ్యంలో ఇప్పటికే సీక్వెల్‌ వచ్చింది. 'తను వెడ్స్ మను రిటర్న్స్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు తను వెడ్స్ మను సినిమా ప్రాంచైజీ లో మూడవ భాగం రెడీ అవ్వబోతున్నట్లు దర్శకుడు అధికారికంగా ప్రకటించాడు. కంగనా రనౌత్‌ కి ఎప్పుడూ తను వెడ్స్ మను సినిమా స్పెషల్‌. అందుకే ఆమె సీక్వెల్‌ కి ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన తను వెడ్స్ మను రిటర్న్స్‌ కి మంచి స్పందన వచ్చింది. వసూళ్ల విషయంలోనూ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. అందుకే సీక్వెల్‌ ను చేసేందుకు నిర్మాతలు సైతం ఆసక్తిగా ఉన్నారు. తను వెడ్స్ మను 3 సినిమా గురించి చిత్ర దర్శకుడు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ మూడు విభిన్నమైన పాత్రల్లో కంగనా కనిపించబోతుందని దర్శకుడు ఆసక్తికర ప్రకటన చేయడం జరిగింది.

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఓరియంటెడ్‌ సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ ఒక హీరోయిన్‌ డబుల్‌ రోల్‌ లో కనిపించడమే చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తను వెడ్స్ మను సీక్వెల్‌ కోసం కంగనా ఏకంగా మూడు పాత్రలను చేసేందుకు రెడీ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ట్రిపుల్‌ రోల్‌ లో ఒక హీరోయిన్‌ నటించడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే కంగనా తను వెడ్స్ మను 3 ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అంటూ నెటిజన్లు తో పాటు, ఆమె ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది లో ప్రారంభం అవ్వబోతున్న ఈ సీక్వెల్‌ ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News