నటీమణులకు వృద్ధాప్యం రాకుండా చికిత్స?
వారంతా పలు సందర్భాలలో మీడియా ఎదుటే తమకు జరిగిన శస్త్ర చికిత్సల గురించి ఓపెనయ్యారు.
కథానాయికలు తమను తాము తెరపై అందంగా ప్రెజెంట్ చేసుకునేందుకు శస్త్ర చికిత్సలను ఆశ్రయించడం చాలా కాలంగా చూస్తున్నదే. కొన్నిసార్లు చికిత్సలు వికటించి వికృత రూపానికి మారిపోయిన భామలు ఉన్నారు. ముక్కు, పెదవులు, లేదా ముఖానికి శస్త్ర చికిత్సలు చేయించుకుని అందం పెంచుకున్న కథానాయికలు సౌత్, నార్త్ లోను డజన్ల కొద్దీ ఉన్నారు. వారంతా పలు సందర్భాలలో మీడియా ఎదుటే తమకు జరిగిన శస్త్ర చికిత్సల గురించి ఓపెనయ్యారు.
అదంతా అటుంచితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్వీన్ కంగన, అందం కోసం శస్త్ర చికిత్సలకు సిద్ధమయ్యే నటీమణుల గురించి వివరించిన తీరు ఆశ్చర్యపరిచింది. కొందరు ఫేక్ ఐల్యాష్ , బొటాక్స్ తో వృద్ధాప్యం రాకుండా ఆపేసే ప్రయత్నం చేస్తారని, తాను అలాంటి కేటగిరీకి చెందనని క్వీన్ కంగన అన్నారు. కంగన వ్యాఖ్యతో నిజంగానే నటీమణులు వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఇలా చేస్తున్నారా? అంటూ మరోసారి ఇంటర్నెట్ లో డిబేట్ స్టార్టయింది.
సినీపరిశ్రమలో కథానాయికలను చిన్న చూపు చూస్తారని, కేవలం 10-15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రలను మాత్రమే దర్శకులు ఆఫర్ చేస్తారని కంగన విమర్శించారు. అలాంటి దర్శకులతో తాను పని చేయాలా? అని కూడా ప్రశ్నించారు. పద్మావత్ చిత్రంలో తొలిగా తనకు మాత్రమే ప్రధాన పాత్రలో ఆఫర్ ఇచ్చారని, కానీ స్క్రిప్టు అడిగితే ఇవ్వడానికి నిరాకరించినందున ఆ సినిమాని చేయలేదని కూడా కంగన అన్నారు. భన్సాలీ పేరు పెట్టకుండానే వేశ్యల కథలు, పాత్రలతో మల్టీవర్స్ చేసిన దర్శకుడు అంటూ కంగన `పద్మావత్` గురించి మాట్లాడటం చర్చకు వచ్చింది. స్క్రిప్టు ఇవ్వరు.. కనీసం పాత్ర ఏమిటన్నది చెప్పరు! అని కూడా కంగన నర్మగర్భంగా భన్సాలీని, ఆయన లాంటి పెద్ద దర్శకులందరినీ టార్గెట్ చేసింది క్వీన్ కంగన.