కంగువా.. రిలీజ్ లో టెన్షన్ టెన్షన్!

రెంటల్ విధానంలో అయితే 'కంగువా' రిలీజ్ చేయమని ఏషియన్ మల్టీప్లెక్స్ ఓనర్ స్పష్టంగా చెప్పేశారంట.

Update: 2024-11-13 09:57 GMT

కోలీవుడ్ నుంచి నవంబర్ 14న రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కంగువా'పై దేశ వ్యాప్తంగా బజ్ ఉంది. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషలలో ఈ సినిమాపైనే ఎక్కువ క్రేజ్ ఉంది. దీనికి కారణం సూర్య మాస్ ఇమేజ్ అని చెప్పొచ్చు. అలాగే పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తోన్న ఈ సినిమాని విజువల్ స్పెక్టక్యులర్ గా డైరెక్టర్ శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలంగాణాలో రిలీజ్ చేస్తోంది. భారీ ధరకి ఈ మూవీ నైజాం రైట్స్ ని మైత్రీ వారు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి తెలంగాణాలో థియేటర్స్ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. రిలీజ్ కి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారు తీసుకున్న నిర్ణయం వలన మల్టీ ప్లెక్స్ లలో సినిమా విడుదల కాకపోవచ్చని అనుకుంటున్నారు.

నిజానికి థియేటర్స్ లో సినిమాలని షేరింగ్ మీద డిస్టిబ్యూటర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వచ్చిన కలెక్షన్స్ లో థియేటర్ ఓనర్స్ కి అలాగే డిస్టిబ్యూటర్స్ కి పర్సెంటేజ్ షేరింగ్ ఉంటుంది. అయితే 'కంగువా' చిత్రాన్ని మైత్రీ మూవీ రెంటల్ విధానంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అంటే ఈ సినిమా ఎన్ని రోజులు థియేటర్స్ లో ప్రదర్శిస్తే అన్ని రోజులకి రెంట్ ఇస్తారు. ఏ విధానాన్ని ఏషియన్ మూవీస్ తిరస్కరించింది. రెంటల్ విధానంలో అయితే 'కంగువా' రిలీజ్ చేయమని ఏషియన్ మల్టీప్లెక్స్ ఓనర్ స్పష్టంగా చెప్పేశారంట.

మిగిలిన ఎగ్జిబిటర్లు కూడా రెంటల్ విధానానికి ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 2' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రెంటల్ విధానంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే సారి ఇబ్బంది పడకుండా ఉండటానికి 'కంగువా'ని కూడా అలాగే రిలీజ్ చేసి థియేటర్స్ ఓనర్స్ కి అలవాటు చేయాలని భావించారు. అయితే మైత్రీ వారు తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యజమానులు వ్యతిరేకించడంతో 'కంగువా' రిలీజ్ కి ఊహించని ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఒకవేళ మైత్రీ వారు వెనక్కి తగ్గకపోతే ఏషియన్ మల్టీప్లెక్స్ లలో 'కంగువా'ని ప్రదర్శించే అవకాశం ఉండదని అనుకుంటున్నారు. దీని స్థానంలో వరుణ్ తేజ్ 'మట్కా'కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణాలోనే ఈ సమస్య ఉంది. దీనికి పరిష్కారం దొరికితే 'కంగువా' రిలీజ్ కి ఇబ్బంది ఉండదు. లేదంటే నైజాంలో ఈ మూవీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.

Tags:    

Similar News