కంగువా.. ఇది కలిసొచ్చే అంశమే..
రెండు డిఫరెంట్ టైం లైన్స్ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండబోతోందనే విషయం అందరికి తెలిసిందే.
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ ‘కంగువా’ నవంబర్ 14న థియేటర్స్ లోకి రాబోతోంది. ఒకే సారి 8 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని 300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించాయి.
రెండు డిఫరెంట్ టైం లైన్స్ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండబోతోందనే విషయం అందరికి తెలిసిందే. ట్రైబల్ వారియర్ కంగువా పాత్రలో సూర్య ఈ మూవీలో నటిస్తున్నాడు. అలాగే ప్రెజెంట్ లో ఫ్రాన్సిస్ అనే మరో క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య కనెక్షన్ ఏంటి అనేది కథలో కీలకంగా ఉండబోతోందంట. ఇదిలా ఉంటే ఈ మూవీ రన్ టైం ఎంత అనేది ఇప్పుడు బయటకొచ్చింది. సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాలు ఉండేలా డైరెక్టర్ శివ ఫైనల్ కట్ రెడీ చేసినట్లు సమాచారం.
ఈ మధ్యకాలంలో పీరియాడికల్ జోనర్ లో వచ్చే పాన్ ఇండియా మూవీస్ అన్ని కూడా 3 గంటలకి పైగా నిడివి ఉంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన దేవర మూవీ 2 గంటల 45 నిమిషాల నిడివి ఉంది. అయితే కంగువా విషయంలో మాత్రం డైరెక్టర్ శివ రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయలేదంట. ఎక్కువ ల్యాగ్ లేకుండా పెర్ఫెక్ట్ నేరేషన్ ఉండేలా తక్కువ రన్ టైంలో అవుట్ పుట్ సిద్ధం చేసినట్లు టాక్. మొత్తం మూవీలో 2 గంటల కథ కంగువా చుట్టూ హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది.
మిగిలిన 26 నిమిషాల నిడివి ఫ్రాన్సిస్ క్యారెక్టర్ పైన ప్రెజెంట్ లో జరుగుతుందనే మాట వినిపిస్తోంది. ఈ రన్ టైమ్ సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అనే ప్రచారం నడుస్తోంది. తక్కువ రన్ టైం ఉండటం వలన ప్రేక్షకులని ఎంగేజ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కథలలో ఏ మాత్రం ల్యాగ్ ఉన్న ఆడియన్స్ చూడటానికి ఇష్టపడటం లేదు. ‘కంగువా’ మూవీకి రన్ టైం పెద్ద ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కోలీవుడ్ లో భారీ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది.
కచ్చితంగా ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని నమ్ముతున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. దిశా పటాని హీరోయిన్ గా చేసింది. రెండు భాగాలుగా ‘కంగువా’ మూవీ రాబోతోంది. ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.