'దేవర'ను కూడా ఇలానే ట్రోల్ చేసారు.. 'కంగువ' నిర్మాత కామెంట్స్!
ఈ నేపథ్యంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా జూమ్ మీటింగ్ ద్వారా తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ''కంగువ''. సిరుతై శివ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ సినిమా తెరకెక్కింది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. సౌండ్ మిక్సింగ్ సరిగా లేదని, సినిమాలో లౌడ్ నెస్ మరీ ఎక్కువైందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా జూమ్ మీటింగ్ ద్వారా తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ''నేను 'కంగువ' కంటెంట్ విషయంలో చాలా పాజిటివ్ గా ఉన్నాను. తొలి రోజు ఫ్యాన్ వార్స్, ఇలాంటివి కామన్ గా వచ్చేవే. మార్నింగ్ షోకి మిక్స్డ్ రివ్యూలు, ట్రోల్స్ వచ్చాయి. కానీ జనరల్ ఆడియన్స్ ఎవరూ కంటెంట్ గురించి ట్రోల్ చెయ్యలేదు. పర్సనల్ థింగ్స్, పొలిటికల్ థింగ్స్ తో ఫ్యాన్ వార్స్ మాత్రమే జరిగాయి. 'దేవర' 'ది గోట్' లాంటి కొన్ని సినిమాలకు ఇలానే ట్రోల్స్ చూసాం. కానీ ఇప్పుడు అంతా సెటిల్ అయింది. మేం థియేటర్లు విజిట్ చేసాం. జనరల్ ఆడియన్స్ సినిమా చూసి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు'' అని అన్నారు.
''కంగువ సినిమా పట్ల ఇంత ప్రేమను చూపించిన తెలుగు ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ గా థాంక్స్ చెప్పాలి. చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 3డీ ఫార్మాట్ కు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాకపోతే కొంతమంది 2డీ ఫార్మాట్ లో చూడటానికే ఇష్టపడుతున్నారు. 20 శాతం మంది మాత్రం 2డీలో ఉన్న ఎమోషన్ 3డీలో లేదని చెప్పారు. మరికొందరు మాత్రం ఇండియన్ సినిమాలో తొలిసారిగా ఇలాంటి బిగ్ సినిమాని ప్రారర్ గా త్రీడీలో చూపించారని అంటున్నారు. కానీ త్రీడీలో బాగాలేదని అన్నవారు కూడా కొందరు ఉన్నారు'' అని నిర్మాత చెప్పారు.
ఓపెనింగ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. 'కంగువ' సినిమాకి ఎక్స్ పెక్టేషన్స్ చాలా హై లో ఉన్నాయి. అంచనాలతో పోలిస్తే ఓపెనింగ్ నంబర్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇది ఫెస్టివల్ రిలీజ్ కాదు. నాన్ హాలిడేలో, అది కూడా శుక్రవారం కాకుండా గురువారం రిలీజ్ అయింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని చూస్తే ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినట్లే. సూర్య గత చిత్రాలతో కంపేర్ చేస్తే, ఏరియాల వారీగా ఫుల్ రన్ హయ్యెస్ట్ కలెక్షన్స్ ను 2 -3 రోజుల్లోనే ఈ మూవీ క్రాస్ చేస్తుంది. కమర్షియల్ గా ఇది సూర్యకి బిగ్ జంప్. వీకెండ్ లో వసూళ్లు ఇంకా పుంజుకుంటాయి అని కేఈ జ్ఞానవేల్ రాజా తెలిపారు. నార్త్ లో 4 కోట్లకు పైగానే ఓపెనింగ్ వచ్చిందని చెప్పారు.
సినిమాలో ప్రస్తుత కాలంలో జరిగే పోర్షన్ లో మొదటి 20 నిముషాలు కాస్త స్లోగా ఉందనే కామెంట్స్ వచ్చిన మాట వాస్తవమే అని నిర్మాత అంగీకరించారు. అయితే రన్‌టైమ్ ను ట్రిమ్ చేయాలనే అంత బ్యాడ్ ఫీడ్ రాలేదు కాబట్టి, సీన్స్ ని కట్ చేసే అవసరం లేదని చెప్పారు. సూర్య పెరఫార్మన్స్, హార్డ్ వర్క్, డెడికేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. గ్రాండ్ స్కేల్ లో తీసారని పబ్లిక్, రివ్యూలు చెబుతుంటే ప్రొడ్యూసర్ గా చాలా హార్ట్ టచింగ్ గా ఉందన్నారు.
''మ్యూజిక్, డైలాగ్స్ లో లౌడ్ నెస్ మరి ఎక్కువగా ఉందనే విమర్శలు మా దృష్టికి వచ్చాయి. సినిమా కథ 1000 ఏళ్ళ క్రితం నాటిది కావడం, ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ ఉండటం వల్ల లౌడ్ నెస్ ఎక్కువైందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. మేము ఇప్పటికే ఎగ్జిబిటర్లందరితో మాట్లాడాము. లౌడ్ నెస్ తగ్గించేందుకు నార్మల్ వాల్యూమ్ రేంజ్ కంటే రెండు పాయింట్లను తగ్గించమని అందరినీ కోరాం'' అని జ్ఞానవేల్ రాజా తెలిపారు. 'కంగువ 2' పై స్పందిస్తూ.. డైరెక్టర్ శివ వెంటనే అజిత్ తో ఓ సినిమా చేయబోతున్నాడని, అది పూర్తైన తర్వాత కంగువ సీక్వెల్ పనులు మొదలవుతాయని చెప్పారు. పార్ట్-2 చాలా వైల్డ్‌గా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ కంటే భారీ స్కేల్ లో ఉంటుందని నిర్మాత చెప్పుకొచ్చారు.