కంగువా.. మళ్ళీ ఈ గోడవేంటి?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. పాన్ ఇండియా మూవీ కంగువాతో మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-12 09:33 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. పాన్ ఇండియా మూవీ కంగువాతో మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, ప్రముఖ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నారు.

అయితే నవంబర్ 14వ తేదీన పదికిపైగా భాషల్లో రిలీజ్ కానున్న కంగువా సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేపడుతున్నారు మేకర్స్. వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ తో అందరి దృష్టిని సినిమా వైపు తిప్పుకుంటున్నారు. సూర్య కూడా ఎన్నడూ లేని విధంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ మూవీపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. మంచి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

అదే సమయంలో కంగువా మూవీ రూ.1000 కోట్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అంటే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టాల్సిందే. అది జరగాలి అంటే పెద్ద ఎత్తున థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలి. అయితే కోలీవుడ్ హీరో అయిన సూర్య మూవీ.. తమిళనాడు కన్నా తెలుగులో భారీగా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ కన్నా టాలీవుడ్ లోనే ఓపెనింగ్స్ ఎక్కువ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కంగువా మూవీకి గాను మార్నింగ్ 7AM షోస్ పడుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. కానీ తమిళనాడులో పరిస్థితి వేరేలా ఉంది. శివకార్తికేయన్, సాయిపల్లవి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అమరన్ వల్ల అనుకున్న స్థాయిలో థియేటర్స్ లో కంగువా రిలీజ్ కావడం లేదు. 50 శాతం థియేటర్స్ ను మాత్రమే కంగువా దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు రకరకాల కారణాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నార్మల్ గా కోలీవుడ్ లో సినిమా రన్ అయిన మూడో వారం నుంచి షేర్ డిస్ట్రిబ్యూటర్స్ కు వెళ్తుంది. దీంతో అమరన్ ఇప్పటికీ దూసుకుపోతుండడంతో కంగువాకు తగినన్ని స్క్రీన్స్ దక్కలేదని వార్తలు వస్తున్నాయి. అలా చేయడం వల్ల అమరన్ తో డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు వచ్చినా.. కంగువా నెంబర్స్ పై మాత్రం ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుందనే చెప్పాలి.

మరోవైపు, వసూళ్లలో 75 శాతం షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ కు కంగువా మేకర్స్ చెబుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దీంతో మంచి లాభాలు అందిస్తున్న అమరన్ చిత్రాన్ని ఎత్తేసి.. కంగువాను వేయాల్సిన అవసరమేంటనే విధంగా కొందరు ఎగ్జిబిటర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా కంగువా చిత్రానికి తమిళనాడులో తక్కువ థియేటర్లు దక్కాయట. మరి అక్కడ కంగువా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News