ప్రముఖ నటుడి అరెస్ట్‌.. అసలు మ్యాటర్‌ ఇదే

లైంగిక వేదింపుల కేసులో చరిత్ అరెస్ట్‌ అయ్యాడని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సహ నటిని గత కొన్నాళ్లుగా వేదిస్తున్న కారణంగా చరిత్‌ను అరెస్ట్‌ చేశారని తెలుస్తోంది.

Update: 2024-12-29 06:30 GMT

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు చరిత్‌ బాలప్పను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. లైంగిక వేదింపుల కేసులో చరిత్ అరెస్ట్‌ అయ్యాడని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సహ నటిని గత కొన్నాళ్లుగా వేదిస్తున్న కారణంగా చరిత్‌ను అరెస్ట్‌ చేశారని తెలుస్తోంది. బెంగళూరులోని రాజేశ్వరీ పేట పోలీసులు కేసును నమోదు చేసి చరిత్‌ను అరెస్ట్‌ చేశారు. కన్నడంలో ముద్దులక్ష్మి సీరియల్‌తో పాటు పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు సొంతం చేసుకున్న చరిత్‌ తెలుగులోనూ కొన్ని సీరియల్స్ ద్వారా గుర్తింపు దక్కించుకున్నాడు. నటుడిగా బిజీగా ఉన్న చరిత్‌ లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్‌ కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ వారిపై లైంగిక వేధింపుల కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషలకు చెందిన వారిపై ఏదో ఒక సమయంలో ఇలాంటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చరిత్‌ బాలప్పకు మంచి పేరుందని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి కేసు నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందని కొందరు ఆయన సన్నిహితులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. పోలీసులు మాత్రం సహ నటిని లైంగికంగా వేధించడం తో పాటు విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని కేసు నమోదు అయ్యిందని, అందుకే అరెస్ట్‌ చేశామని చెబుతున్నారు.

డిసెంబర్‌ 13న కేసు నమోదు కాగా, ఎంక్వౌరీ చేసిన తర్వాతే చరిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు సీరియల్స్‌లో ఆమె చరిత్‌తో కలిసి నటించిందట. షూటింగ్‌ సమయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, ఈ విషయాలు బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గత జూన్‌లో చరిత్‌ పై మాజీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను భరణం అడిగినందుకు బెదిరించాడని, కోర్టు ఇవ్వాలని ఆదేశించిన భరణంను చరిత్‌ ఇవ్వడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ కేసు విచారణ జరుగుతున్న ఈ సమయంలోనే చరిత్‌ పై లైంగిక వేదింపుల కేసు నమోదు కావడం జరిగింది.

నటి కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలతో సహా చరిత్‌ను పట్టుకున్నారని, పలు సాక్షాలను ఆమె ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న చరిత్‌ బాలప్ప బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఇలాంటి లైంగిక వేధింపులు ఎన్నో ఉంటాయని, కొందరు మాత్రమే ధైర్యం చేసి బయటకు వస్తున్నారని కొందరు అంటున్నారు. భరించలేనంత లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారు అంతా కఠినంగా శిక్షింపబడాలి అంటూ కొందరు మహిళ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో నటికి మద్దతుగా పలువురు చరిత్‌కి వెంటనే శిక్ష పడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News