ద‌ర్శ‌న్‌ని క‌న్న‌డ ఇండ‌స్ట్రీ బ్యాన్ చేయాలి

దర్శన్‌ను చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించాలని, ఆయన సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని హ‌త్య‌కు గురైన‌ అభిమాని తల్లి రత్నప్రభ బుధవారం మీడియాతో అన్నారు.

Update: 2024-06-13 04:00 GMT

దర్శన్‌ను చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించాలని, ఆయన సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని హ‌త్య‌కు గురైన‌ అభిమాని తల్లి రత్నప్రభ బుధవారం మీడియాతో అన్నారు.

సూపర్‌స్టార్ దర్శన్ చేతిలో హత్యకు గురైన అభిమాని రేణుకా స్వామి తల్లి .. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ద‌ర్శ‌న్‌ని నిషేధించాలని కోరారు.

దర్శన్‌ను విలన్‌గా అభివర్ణించిన ఆమె.. అతనో దొంగ, నేరస్థుడని, తమ ఆరాధ్యదైవం చేసిన దారుణమైన నేరాన్ని ఆయన అభిమానులు తెలుసుకోవాలని అన్నారు. ``దర్శన్ కొడుకుకు కూడా నా కొడుకుకు ఎదురైన గతి తప్పదు`` అంటూ శపించారు. పవిత్ర గౌడకు తన కుమారుడు పంపిన అసభ్యకరమైన సందేశాన్ని దర్శన్ తమకు తెలియజేసి ఉండవచ్చని, వారు అతడిని మందలించి ఉండేవారని రేణుకాస్వామి తండ్రి శివనగౌడ పేర్కొన్నారు. ``భవిష్యత్తులో నా కొడుకులాగా ఎవ్వరినీ బాధపెట్టకుండా ఉండేందుకు భగవంతుడు దర్శనం ఇవ్వాలి. నా కొడుకు భార్య గర్భవతి. నేను రిటైర్ అయ్యాను. ఆమె తన జీవితాన్ని ఎలా నడిపించాలి?`` అని ప్రశ్నించాడు.

ఇదిలా వుండగా రేణుకాస్వామి హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు దర్శన్, పవిత్ర గౌడ స‌హా మరో 11 మంది నిందితులను బుధవారం నాడు అంటే రెండో రోజు విచారణ కొనసాగించారు. వారంద‌రినీ మంగళవారం అరెస్టు చేసి ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. పవిత్ర గౌడను రాత్రిపూట అబ్జర్వేషన్ సెంటర్‌లో ఉంచారు. సూపర్ స్టార్ దర్శన్‌ సహా ఇతర నిందితులు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లోని సెల్‌లో రాత్రంతా గడిపారు.

బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద, డిసిపి (వెస్ట్), ఎస్ గిరీష్ బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుండి బ్రీఫింగ్ స్వీకరించి కేసుకు ఆదేశాలు ఇచ్చారు. రేణుకాస్వామి తన ప్రైవేట్ పార్ట్‌ల ఫోటోని పవిత్ర గౌడకు పంపి దర్శన్ కంటే తానే బెటర్ అని మెసేజ్‌లో పేర్కొన్నట్లు విచారణలో ఇప్పటివరకు తేలింది. పవిత్ర గౌడ ఈ విషయాన్ని నిందితుల్లో ఒకరైన పవన్‌తో షేర్ చేసుకున్నారని అతడు దర్శన్‌కు సమాచారం ఇచ్చాడని, ఫలితంగా రేణుకస్వామి హత్య జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

రేణుకాస్వామిని బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న షెడ్డుకు పవిత్ర గౌడను కూడా పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని కూడా పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె చెప్పుతో అత‌డిని కొట్టారు.

రేణుకా స్వామి మెసేజ్‌ని దృష్టిలో ఉంచుకుని దర్శన్ అతడి సహచరులు అత‌డి ప్రైవేట్ భాగాలపై దాడి చేశారు. రేణుకాస్వామి మృతదేహాన్ని పారవేసేందుకు, హత్యకు బాధ్యత వహించాలని దర్శన్ ఒక ముఠాకు రూ.30 లక్షలు ఇచ్చారని కూడా పోలీస్ వర్గాలు తెలిపాయి. దీంతో నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి తామే నేరానికి పాల్పడ్డామని తెలిపారు. అయితే పోలీసులు వారిని విడివిడిగా విచారించగా.. వారి వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో నిజానిజాలను వెలికితీయడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు.

వ‌ర‌స ప‌రిణామాల అనంత‌రం దర్శన్ మొదటి భార్య అతడిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది. ఈ పరిణామాల తర్వాత తన ప్రొఫైల్ ఫోటోని కూడా తొలగించింది. గ‌తంలో దర్శన్‌తో క‌లిసి ఉన్న ఫోటోలను షేర్ చేస‌నందుకు వారి 10 సంవత్సరాల సుదీర్ఘ సంబంధం గురించి సోష‌ల్ మీడియాల్లో బ‌హిరంగంగా రాసినందుకు పవిత్ర గౌడపై మొదటి భార్య విరుచుకుపడింది.

సోషల్ మీడియాలో తీవ్రమైన మాటల యుద్ధం తరువాత ఒక వర్గం అభిమానులు మొదటి భార్యకు మద్దతు ఇవ్వగా.. మరొక వర్గం దర్శన్ కుటుంబ జీవితాన్ని నాశనం చేసిందని పవిత్ర గౌడను నిందించింది. అభిమాని రేణుకాస్వామి ... దర్శన్ తన మొదటి భార్య కొడుకుతో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి అతడు ద‌ర్శ‌న్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడల్లా పవిత్ర గౌడను టార్గెట్ చేశాడు.

దర్శన్ అతడి సహచరులు రేణుకాస్వామిపై దారుణంగా దాడి చేసి అతడి తల, ముఖం, ఛాతీ, వీపుపై కొట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడి ముక్కు, నోరు, దవడ కోసుకుపోయాయి. శరీరంపై కాలిన గాయాలు కనిపించాయి. వేడి వేడి ఇనుప కడ్డీని ఉపయోగించి గాయ‌ప‌ర‌చారని తెలుస్తోంది. దర్శన్‌ సహా 10 మందికి పైగా వ్యక్తులు రేణుకాస్వామిపై దాడి చేసి.. గోడపైకి చాలాసార్లు విసిరికొట్టార‌ని రిపోర్టులు పేర్కొన్నాయి.

రేణుకాస్వామి ఫార్మాసిటీలో పనిచేస్తున్నాడని, పెళ్లయి ఏడాది అయిందని మృతురాలి కుటుంబీకులు తెలిపారు. అతని భార్య ఐదు నెలల గర్భిణి. జూన్ 9న కాల్వలో గుర్తుతెలియని మృతదేహాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News