కన్నప్ప.. రాకుమారి నెమలి లుక్ చూశారా?

అందంలో సహజం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్యం.. కన్నప్పకి సర్వస్వం.. చెంచు యువరాణి నెమలి అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.

Update: 2024-12-30 12:02 GMT

టాలీవుడ్ ప్రముఖ సినీ కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీ నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. హీరో మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. కొంతకాలంగా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

 

ఎవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌ పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో మహాదేవ శాస్త్రి పాత్రలో ఆయన నటిస్తున్నారు. మంచు విష్ణు పిల్లలు ఆరియానా, వివియానా, అవ్రామ్ కూడా యాక్ట్ చేస్తున్నారు. మంచు మూడో తరం కూడా సినీ ఇండస్ట్రీలోకి కన్నప్పతో వస్తుంది.

అయితే ప్రభాస్‌, శరత్‌ కుమార్‌, మధుబాల, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు కన్నప్పలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రమోషన్స్ లో భాగంగా శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజు ప్రతి వీక్ కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తున్నారు.

ఇప్పటికే మోహ‌న్ బాబు, మంచు విష్ణులతో పాటు ప‌లువురు ఫస్ట్ లుక్స్ ను విడుదల చేశారు మేకర్స్. తాజాగా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రీతి ముకుందన్ లుక్ ను రివీల్ చేశారు. సినిమాలో ఆమె క‌న్న‌ప్ప‌ ఇష్ట‌స‌ఖి, చెంచుల యువ‌రాణి నెమ‌లి పాత్ర‌లో న‌టిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పోస్టర్ లో ప్రీతి తన అందంతో అదరగొట్టేశారు. బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుంది.

అందంలో సహజం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్యం.. కన్నప్పకి సర్వస్వం.. చెంచు యువరాణి నెమలి అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. విష్ణుకు జోడీగా స్క్రీన్‌ ను పంచుకుంటూ, దివ్య గాధకు మనోజ్ఞతను జోడించిందంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీతి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సినీ ప్రియులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా.. త్వరలో గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

Tags:    

Similar News