వీడియో : కన్నప్ప కోసం మోహన్‌బాబు, విష్ణు...!

అందుకు సంబంధించిన వీడియోను సైతం కన్నప్ప మేకర్స్ షేర్‌ చేశారు.

Update: 2024-10-25 10:22 GMT

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. డిసెంబర్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయింది. చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా సినిమా షూటింగ్ కి సంబంధించిన విషయాలను గురించి రివీల్‌ చేస్తూ వీడియోను షేర్ చేయడం జరిగింది. అందులో మోహన్‌ బాబు, మంచు విష్ణుతో పాటు తదితరులు ఉన్నారు. అత్యంత కఠిన ప్రదేశాల్లో కన్నప్ప సినిమా షూటింగ్‌ చేయడం జరిగిందట. సినిమా విడుదల సమయంలో యూనిట్‌ సభ్యులు కేథార్‌నాథ్‌, బద్రినాథ్‌ ఆలయాలను సందర్శించడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను సైతం కన్నప్ప మేకర్స్ షేర్‌ చేశారు.

చాలా సంవత్సరాలుగా భక్త కన్నప్ప సినిమాను చేయాలనే పట్టుదలతో మంచు విష్ణు ఉన్నాడు. మోహన్ బాబు సైతం తన తనయుడికి మద్దతుగా నిలిచి ఈ సినిమా కోసం తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయి మూవీగా రూపొందించడం జరిగింది. దాదాపుగా రూ.160 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించడం జరిగిందట. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ షురూ చేస్తున్నట్లుగా ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. షూటింగ్‌ పూర్తి చేసి, గ్రాఫిక్స్ వర్క్ ను సైతం ముగించాలని ప్లాన్‌ చేస్తున్నారు. నవంబర్‌ వరకు ఫస్ట్‌ కాపీ సిద్దం చేయడం ద్వారా డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో మంచు విష్ణు చేసిన సినిమాలతో పాటు మోహన్‌ బాబు చేసిన సినిమాలకు నిరాశే మిగిలింది. కమర్షియల్‌గా నిరాశ ఎదుర్కోవడమే కాకుండా సోషల్‌ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ ను ఎదుర్కోవడం జరిగింది. సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ను పట్టించుకోకుండా మోహన్‌ బాబు, మంచు విష్ణు కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పెద్దగా లేవు. కానీ విడుదల సమయంకు ట్రైలర్‌, టీజర్ లతో సినిమా పై అంచనాలు పెంచడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ముకేష్‌ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పీరియాడికల్‌ మూవీలో పలువురు స్టార్స్ కనిపించబోతున్నారు. ముఖ్యంగా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. మొదట ఈ సినిమాలో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు. అంతకు మించి ఒక మంచి పాత్రను, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర, కథకు అత్యంత కీలకమైన పాత్రను ప్రభాస్ చేశాడని ఒక చిట్‌ చాట్‌ లో విష్ణు ప్రకటించాడు. తప్పకుండా ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంను విష్ణు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే స్పష్టమైన రిలీజ్ డేట్‌ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News