300 జీతంతో మొద‌లై 300 కోట్లు సంపాదించిన‌ TV న‌టుడు!

కపిల్ శర్మ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టి పెరిగాడు. అతని తండ్రి జితేంద్ర కుమార్ ఒక హెడ్ కానిస్టేబుల్. అతని తల్లి జాంకీ రాణి గృహిణి. కపిల్‌కు ఒక అన్న, ఒక సోదరి కూడా ఉన్నారు.

Update: 2024-10-15 03:30 GMT

చాలా మంది యువ‌కుల్లానే అత‌డు కూడా ముంబైలో అడుగుపెట్టి ఉద్యోగ‌ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాడు. 300-500 మ‌ధ్య‌ జీతంతో అత‌డి జీవితం మొద‌లైంది. కానీ ఇప్పుడు అత‌డు 300 కోట్ల‌కు అధిప‌తి. బుల్లితెర‌ను ఏల్తున్నాడు. హోస్ట్ గా, రియాలిటీ షో నిర్మాత‌గా పెద్ద స్థాయికి చేరుకున్నాడు. భార‌తీయ బుల్లితెర, వినోద‌రంగంలో అత‌డి ఎదుగుద‌ల నిరంత‌రం స్ఫూర్తిని నింపే పాఠం.

ఇటీవ‌ల 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2'తో హాస్యపు రారాజు కపిల్ శర్మ హృదయాలను గెలుచుకుంటున్నాడు. తనదైన‌ సిగ్నేచర్ హాస్యం ఆకర్షణతో, కపిల్ తోటి హాస్యనటులు సునీల్ గ్రోవర్, కికు శారదాతో కలిసి నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. కానీ ఈరోజు అత‌డి ఈ విజయం వెనుక చాలా మందికి తెలియని గ్రిట్, దృఢ సంకల్పం , పోరాట కథ దాగి ఉంది. కపిల్ శర్మ ఒక సాధాసీదా ప్రారంభం నుండి భారతదేశంలోని అత్యంత సంపన్న హాస్యనటులలో ఒకరిగా మారడం వరకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ప‌రిశీలించ‌ద‌గిన‌ది.

కపిల్ శర్మ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టి పెరిగాడు. అతని తండ్రి జితేంద్ర కుమార్ ఒక హెడ్ కానిస్టేబుల్. అతని తల్లి జాంకీ రాణి గృహిణి. కపిల్‌కు ఒక అన్న, ఒక సోదరి కూడా ఉన్నారు. చిన్నప్పటి నుండి కపిల్ చాలా కొంటెగా ఉల్లాసంగా ఉండేవాడు. అతను మొదట్లో కమర్షియల్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ విద్య‌ను అభ్యసించినా కానీ జీవితం వేరే మలుపు తిరిగింది. అతడు కళాశాల విద్యార్థులకు థియేటర్ స్ట‌డీస్ ను నేర్పించడం ప్రారంభించాడు. కపిల్ తండ్రి 22 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించాడు. ఆ సంవత్సరం కపిల్, అతడి కుటుంబం కష్టాలతో క‌ల‌త‌కు గురైంది. వారు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. తండ్రి మరణానంతరం కపిల్‌కు పోలీస్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పినా అందుకు నిరాకరించాడు. చిన్నప్పటి నుంచి కపిల్‌కి సింగర్‌ కావాలనే కోరిక ఉండేది. అయినా కానీ అతడు తరువాత నాటకరంగంలో చేరాడు. వివిధ ప్రదేశాలలో నాటకాలను ప్రదర్శించడం ప్రారంభించాడు.

కపిల్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాడు. తొలినాళ్లలో పీసీఓ బూత్‌లో పనిచేసి రూ.500 సంపాదించాడు. తన 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత అతడు టెక్స్‌టైల్ మిల్లులో ఉద్యోగంలో చేరాడు. అక్కడ అతను నెలకు రూ.900 సంపాదించాడు. పని చేయమని అతని కుటుంబం అతడిపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు కాబట్టి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని మ్యూజిక్ సిస్టమ్స్ కొనడానికి ఉపయోగించాడు. తన గ్రాడ్యుయేషన్ సమయంలో కపిల్ తన జేబులో కేవలం రూ. 1,200తో ఉద్యోగం కోసం సెలవుల్లో ముంబైకి వెళ్లాడు. అయితే అతను రిక్తహస్తాలతో అమృత్‌సర్‌కు తిరిగి వచ్చాడు.

ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ అనే టీవీ షోలో పాల్గొన్నప్పుడు కపిల్ జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది. అతడు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ప్రారంభించాడు. మూడవ సీజన్‌లో అతడు విజేతగా నిలిచాడు. 10 లక్షల ప్రైజ్ మనీతో తన సోదరి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత కపిల్ వెనుదిరిగి చూడలేదు. విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. 2024 నాటికి కపిల్ తన స్వంత కామెడీ షోను ప్రారంభించాడు. ఒక ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు సంపాదిస్తాడు. కొన్నేళ్లుగా కపిల్ సంపద విపరీతంగా పెరిగింది. అతని మొత్తం ఆస్తులు రూ. 300 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. కపిల్ కృషి , విజయం అతడికి ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించిపెట్టాయి. సహనటుడు సునీల్ గ్రోవర్‌తో బహిరంగ గొడ‌వ‌లు, పతనంతో ఎదురుదెబ్బలు తిన్నా కానీ, కపిల్ బలమైన పునరాగమనం చేశాడు. 2019లో ఫోర్బ్స్ జాబితాలో 53వ స్థానాన్ని పొందాడు. కపిల్ శర్మ రూ. 300 కోట్లతో పరిశ్రమలోని అత్యంత సంపన్న హాస్యనటులలో ఒకరిగా ఎదిగాడు.

కపిల్ శర్మకు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ముంబైలో అందమైన, మరియు పంజాబ్‌లోని ఫామ్‌హౌస్‌ సహా అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అతడి లగ్జరీ కార్ల సేకరణలో రూ. 1.25 కోట్ల విలువైన వోల్వో ఎక్స్‌సి90 , రూ. 1.2 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఎస్350 సిడిఐ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. 2013లో రూ.60 లక్షలకు రేంజ్ రోవర్ ఎవోక్‌ను కొనుగోలు చేశాడు.

Tags:    

Similar News