మేం అబద్ధాల కోరులం.. ఒప్పుకున్న అగ్ర నిర్మాత!
వాస్తవాలను వక్రించి కాకి లెక్కల్ని ప్రచారం చేయడం, తప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లతో మోసపూరిత ప్రకటనలు చేయడం సినీపరిశ్రమలో రెగ్యులర్ గా చూసేదే.
వాస్తవాలను వక్రించి కాకి లెక్కల్ని ప్రచారం చేయడం, తప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లతో మోసపూరిత ప్రకటనలు చేయడం సినీపరిశ్రమలో రెగ్యులర్ గా చూసేదే. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాత కాకి లెక్కల్ని తూర్పారబెడుతూ మరో నిర్మాత భార్య కం నటి నిలదీయడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. సినిమా రివ్యూలు బావున్నాయని థియేటర్ కి వెళితే హాల్ అంతా ఖాళీగా ఉందని, తాను మోసపోయానని, అగ్ర నిర్మాత తప్పుడు బాక్సాఫీస్ లెక్కలు చూపించాడని సదరు నటీమణి ఆవేదన చెందింది.
ఈ ఎపిసోడ్ లో మోసగాడు కరణ్ జోహార్ అయితే, అతడిని తిట్టిన నటి దివ్య ఖోస్లా కుమార్ (టిసిరీస్ భూషణ్ కుమార్ భార్య. ఆలియా ప్రధాన పాత్రలో కరణ్ నిర్మించిన జిగ్రా విడుదల రోజు ఐదు కోట్లు వసూలు చేసిందంటూ కాకి లెక్కలు చెప్పారు. దీనిని వెంటనే ఖండించింది దివ్య ఖోస్లా. ఇది అప్పట్లో సంచలనమే అయింది. ఆ విమర్శను తట్టుకోలేని కరణ్ జోహార్ దివ్య ఖోస్లాపై పరోక్షంగా విరుచుకుపడ్డాడు.
అయితే మొన్ననే కదా టీసిరీస్ భూషణ్ వైఫ్ తిట్టినప్పుడు ఫీలయ్యాడు కరణ్.. ఇంతలోనే తాను అబద్ధాల కోరునని, బాక్సాఫీస్ లెక్కల్ని తప్పుగా చూపుతానని నిజాయితీగా ఒప్పుకున్నాడు.. కరణ్ జోహార్ బాక్సాఫీస్ సంఖ్యలు పెంచినట్లు అంగీకరించాడు. ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఇంటర్వ్యూలో దీనిని అంగీకరించాడు. బాక్సాఫీస్ కలెక్షన్‌లు పెంచి చూపుతామని కరణ్ ఈ ఇంటర్వ్యూలో నిజాయితీగా అంగీకరించారు. స్టార్‌లు ఎల్లప్పుడూ మెరిట్ ఆధారంగా నటించరు .. సమీక్షలు ఇచ్చేప్పుడు సెలబ్రిటీలు పూర్తిగా నిజాయితీగా ఉండకపోవచ్చు.. అని కూడా కరణ్ అన్నారు. ప్రతిభ ఆధారంగా అవకాశాలొస్తాయా? అని ప్రశ్నించగా, నా కంటే ఎక్కువ మంది ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్‌లు పరిశ్రమలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. వారికి సినిమాలు చేసే అవకాశం లేదు. నా కంటే ఎక్కువ మంది ప్రతిభావంతులైన చిత్రనిర్మాతలు ఉన్నారు.. కానీ వారికి చాలా కలిసి రావు అని కరణ్ అన్నారు.
నేను స్టార్స్ కోసం కూడా మాట్లాడను.. నేను నా కోసమే మాట్లాడతాను. అందుకే నేను ప్రత్యేకమైనవాడినని కరణ్ అన్నారు. స్టార్స్ రివ్యూలు నిజాయితీగా ట్వీట్ చేస్తున్నారా? అని ప్రశ్నించగా ``లేదు, మేమంతా అబద్ధాలకోరులం. పెద్ద అబద్ధాలకోరులం`` అని అన్నారు. ఇటీవల సినిమా వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ లో సగభాగాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇవో అయిన అదార్ పూనావాలాకు విక్రయించారని కథనాలొచ్చాయి. కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ విలువ 2000 కోట్లు. దాదాపు 1000 కోట్లు చెల్లించి కరణ్ నుంచి 50శాతం వాటాను సీరమ్ కొనుగోలు చేస్తోందని కథనాలొచ్చాయి.