బాలయ్యని ఏది అడక్కూడదో అదే అడిగిన కరణ్ జోహార్..!

ఐతే బాలయ్య గురించి అందరు చెప్పుకునేది ఏంటంటే ఆయనకు కోపం ఎక్కువ దగ్గరకు వెళ్లిన ఫ్యాన్స్ ని కూడా కొడతాడని అంటుంటారు.

Update: 2024-10-02 14:50 GMT

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎంత ఆవేశంగా కనిపిస్తారో బయట అంత సరదాగా ఉంటారు. అసలు ఆయనలోని ఈ సెన్సాఫ్ హ్యూమర్, కూల్ నెస్ అంతా కూడా ఆహా వారి అన్ స్టాపబుల్ షోనే బయటపడేలా చేసింది. ఆహా అన్ స్టాపబుల్ షో చేయకపోతే మాత్రం బాలకృష్ణ గురించి నిజం ఏంటన్నది జనాలకు తెలిసేది కాదు. ఆ షోని ఆయన హోస్ట్ చేసిన తీరుకి అందరు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఐతే బాలయ్య గురించి అందరు చెప్పుకునేది ఏంటంటే ఆయనకు కోపం ఎక్కువ దగ్గరకు వెళ్లిన ఫ్యాన్స్ ని కూడా కొడతాడని అంటుంటారు. గిట్టని వాళ్లు దాన్నే హైలెట్ చేసి చూపిస్తుంటారు.

బాలకృష్ణ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా తను ఫ్యాన్స్ ని ఎందుకు కొడతాడో చెబుతారు. ఐతే ఈ ప్రశ్న మామూలు ఇంటర్వ్యూలో అడిగితే ఏమో కానీ బాలకృష్ణ ని ఒక అవార్డ్ వేడుకలోనే అడిగాడు. ఆ అడిగిన వాళ్లకు ఎంత ధైర్యం ఉంటే ఇలా అడుగుతారని అనుకోవచ్చు. యెస్ రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన iifm అవార్డ్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలకృష్ణని మీరు ఫ్యాన్స్ ను కొడతారట ఎందుకు అని అడిగాడు.

ఐతే ఆ ప్రశ్న అడుగుతూ నేను కూడా భయపడుతున్నా అని అన్నారు కరణ్ జోహార్. ఐతే దానికి బాలయ్య ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. తనను ఇరిటేట్ చేస్తుంటారు అందుకే అలా కొడుతుంటానని అది తనకు వారి మీద ఉన్న ప్రేమ అని అన్నారు బాలకృష్ణ. ఐతే బాలకృష్ణ ఫ్యాన్స్ ని కొడుతున్నాడు అన్న టాపిక్ బాలీవుడ్ దాకా వెళ్లడం కాస్త షాకింగ్ గానే ఉంది.

ఏది ఏమైనా నట సింహం బాలకృష్ణ అంటే ఏంటన్నది పాన్ ఇండియా లెవెల్ లో అందరికీ తెలిసేలా చేశారు. ఇక బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే కె ఎస్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సినిమా లో ఊర్వశి రౌతెల, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో కూడా బాలయ్య బాబు మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు. N.B.K 109వ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు.

Tags:    

Similar News