అగ్ర హీరోతో సమాన పారితోషికం కోరిన నటి
ఒక అగ్ర కథానాయకుడి సరసన అవకాశం రావడమే గొప్ప అనుకుంటే, అందుకు భిన్నంగా ప్రముఖ కథానాయిక తనకు అగ్ర కథానాయకుడితో సమానంగా పారితోషికం ఇవ్వాల్సిందేనని నిర్మాత వద్ద పట్టుబట్టారు.
ఒక అగ్ర కథానాయకుడి సరసన అవకాశం రావడమే గొప్ప అనుకుంటే, అందుకు భిన్నంగా ప్రముఖ కథానాయిక తనకు అగ్ర కథానాయకుడితో సమానంగా పారితోషికం ఇవ్వాల్సిందేనని నిర్మాత వద్ద పట్టుబట్టారు. చివరికి ఆ దర్శక నిర్మాత నిరాకరించడంతో ఆ సినిమా నుంచి సదరు కథానాయిక వైదొలిగింది. ఆ తర్వాత వేరొక నటిని ఆ అవకాశం వరించింది. ఈ సినిమా 30 కోట్ల తో తోరకెక్కి 85 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆఫర్ ని తిరస్కరించిన కథానాయిక మరెవరో కాదు.. బెబో కరీనా కపూర్. కింగ్ ఖాన్ షారూఖ్ కథానాయకుడిగా కరణ్ జోహార్ తెరకెక్కించిన `కల్ హో నహో`లో కథానాయికగా ఎంపికైంది. కానీ పారితోషికం కారణంగా కరీనా ఈ చిత్రం నుంచి వైదొలగింది. షారూఖ్ తో సమానంగా పారితోషికం ఇవ్వాలని, మేల్ డామినేషన్ ని తగ్గించాలని ప్రయత్నించిన కరీనా ఆశ నెరవేరలేదు. చివరికి కరణ్ తో విభేధాలొచ్చి విడిపోయింది.
తర్వాత ఏడాదిన్నర పాటు ఆ ఇద్దరూ మాట్లాడుకోలేదు. చివరికి కరణ్ తండ్రి యష్ జోహార్ మరణించిన సమయంలో కరీనా తిరిగి తన గురూ కరణ్ జోహార్ ని కలుసుకుంది. అతడిని ఓదార్చింది. ఆ తర్వాత వారి మధ్య స్నేహం రీబూట్ అయింది. మళ్లీ కలిసి సినిమాలకు పని చేసారు. అప్పట్లోనే కరీనా కపూర్ ధైర్యాన్ని మెచ్చుకోని వారు లేరు. బాలీవుడ్ లో మేల్ డామినేషన్ గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది. దానిని అధిగమించేందుకు కొందరు అగ్ర కథానాయికలు ప్రయత్నించారు. తమకు కథానాయకుడితో సమానంగా పారితోషికం కావాలని డిమాండ్ చేసారు. కానీ అది చాలామందికి కలగానే మిగిలిపోయింది. కరీనా ప్రయత్నం కూడా ఇప్పటికీ ఫలించలేదు.
బాలీవుడ్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామాలలో ఒకటైన కల్ హో నా హో (2003)లో షారుఖ్ ఖాన్ , సైఫ్ అలీ ఖాన్‌లతో పాటు ప్రీతి జింతా కథానాయికగా అవకాశం అందుకుంది. ఈ సినిమా ప్రీతి జింతాకు పెద్ద ప్లస్ అయింది. నైనా కేథరీన్ పాత్రలో ప్రీతి నటనకు అందరూ ఫిదా అయ్యారు. కల్ హోనహో 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా 85 కోట్లు వసూలు చేసి, 2003లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకుంది. శంకర్-ఎహ్సాన్-లాయ్‌కి ఉత్తమ సంగీత దర్శకత్వం కేటగిరీలో ..ఐకానిక్ టైటిల్ ట్రాక్‌కు తన స్వరాన్ని అందించిన సోను నిగమ్‌కి ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి.