మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి మ‌హాప్ర‌భో.. ఫోటోగ్రాఫ‌ర్ల‌కు బెబో దణ్ణం..

అయితే లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే ఇంకొద్దిరోజులు పర్యవేక్షణలో ఉంటారని డిశ్చార్జ్ చేయడంపై నిర్ణయం ఒకటి లేదా రెండు రోజుల్లో తీసుకుంటామని చెప్పారు.

Update: 2025-01-20 16:38 GMT

బాంద్రాలోని తన నివాసంలో దుండ‌గుడి కత్తిపోట్లకు గురైన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అత‌డు సోమవారం డిశ్చార్జ్ కావాల్సి ఉంది. అయితే లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే ఇంకొద్దిరోజులు పర్యవేక్షణలో ఉంటారని డిశ్చార్జ్ చేయడంపై నిర్ణయం ఒకటి లేదా రెండు రోజుల్లో తీసుకుంటామని చెప్పారు. ప్ర‌స్తుతానికి సైఫ్ ఇంకా ఆస్ప‌త్రిలోనే ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ముంబై మీడియా అత‌డి బాంద్రా ఇంటి ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ చాలా ర‌చ్చ చేసింది. దీనిపై బెబో క‌రీనా స్పంద‌న అనూహ్యం. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! అంటూ బెబో కరీనా సీరియ‌స్ గా సోష‌ల్ మీడియాలో స్పందించింది. ఫోటోగ్రాఫ‌ర్ల‌కు కఠినమైన హెచ్చరికను జారీ చేశారు. అయితే నిమిషాల్లోనే తన పోస్ట్‌ను తొలగించింది.

నిజానికి సైఫ్‌- క‌రీనా దంప‌తుల కుమారులు తైమూర్- జెహ్ ఆడుకోవ‌డానికి కొన్ని కొత్త బొమ్మ‌ల్ని (ఆట వ‌స్తువులు) బాంద్రా ఇంటికి తీసుకువ‌స్తున్నప్ప‌టి ఫోటో అది. ``పిల్ల‌ల కోసం కొత్త బొమ్మ‌లు వ‌చ్చాయి`` అనే శీర్షిక‌తో ఈ ఫోటోగ్రాఫ్ ని పోస్ట్ చేసింది ఓ పోర్ట‌ల్. కానీ దానిపై క‌రీనా సీరియ‌స్ అయింది. ``ఇప్పుడే దీన్ని ఆపండి.. హృదయం ఉండాలి.. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి`` అని చేతులు జోడించిన ఈమోజీని క‌రీనా షేర్ చేసింది. ఈ వ్యాఖ్య‌ ఇప్పుడు క‌రీనా అధికారిక ఇన్‌స్టా ఖాతాలో అందుబాటులో లేదు.

సైఫ్ పై దాడి చేసిన బంగ్లాదేశీ యువ‌కుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ కేవ‌లం దొంగ‌త‌నం కోసం సెల‌బ్రిటీల ఇండ్ల‌పై రెక్కీ చేస్తున్నాడ‌ని పోలీసులు చెబుతున్నారు. చొరబాటుదారుడు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దాడి జరిగింది. అగంత‌కుడికి ఇంటి పనిమనిషికి మధ్య జరిగిన ఘర్షణలో జోక్యం చేసుకోగా సైఫ్ ఛాతీ వెన్నెముకకు కత్తిపోట్లు తగిలాయి.

ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీస్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయ్ సంహిత (BNS) సెక్షన్లు 311, 312, 331(4), 331(6), మరియు 331(7) కింద నిందితుడిపై అభియోగాలు నమోదు అయ్యాయి. నిందితుడు తన స్వగ్రామానికి పారిపోయే ప్రయత్నంలో థానేలోని హిరానందని ఎస్టేట్‌లో పోలీసుల‌కు చిక్కాడు. అనంత‌రం అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. అతడు బంగ్లాదేశ్‌లోని ఝలోకాటి జిల్లాకు చెందినవాడని తేలింది.

Tags:    

Similar News