నా చిన్న వయసులో చాలా తప్పులు జరిగాయి
క్రూ సినిమా ప్రమోషన్ లో భాగంగా కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'క్రూ' రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య కాలంలో కరీనా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయితే ఈ సినిమా పై కరీనా కపూర్ చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె ఫ్యాన్స్ కూడా క్రూ సినిమా పై నమ్మకంతో ఉంది.
క్రూ సినిమా ప్రమోషన్ లో భాగంగా కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ వల్ల ఈజీగానే ఎంట్రీ దక్కినా కూడా కరీనా కి సక్సెస్ ల కంటే ఫ్లాప్స్ ఎక్కువ పడ్డాయి.
ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఫ్లాప్స్ మరెవ్వరు కూడా చవి చూసి ఉండరు అంది. చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం వల్ల కథ గురించి పాత్రల గురించి కూడా పట్టించుకోకుండా సినిమాలు చేయడం వల్ల అన్ని ఫ్లాప్స్ పడ్డాయని కరీనా పేర్కొంది.
చిన్న వయసులోనే చాలా తప్పులు జరిగాయి. అందుకే చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటూ కరీనా తెలియజేసింది. వరుస ఫ్లాప్స్ తర్వాత కాస్త కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాను. అంతే కాకుండా నా పాత్రల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద చూపించడం వల్ల కెరీర్ గాడిన పడిందని కరీనా పేర్కొంది.