ఆ బ్యూటీ కూడా ఓపెన్ అయిపోయింది!
తాజాగా సీనియర్ నటి కరీనా కపూర్ కూడా స్పందించింది.
బాలీవుడ్ పురుషాధిక్యంపై హీరోయిన్లు స్పందించిన సందర్భాలెన్నో ఉన్నాయి. వాళ్లలో మేము ఎందులో తక్కు వంటూ గొంతెత్తిన నాయికలు చాలా మంది ఉన్నారు. సమాన పారితోషికం విషయంలో ఈ అంశా చాలాసార్లు చర్చకొచ్చింది. ఇటీవలే 'ది క్రూ' సక్సెస్ అయిన నేపథ్యంలో కృతిసనన్ కూడా తన అభిప్రాయాన్ని ఎంతో ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అన్న అంశాన్ని గుర్తు చేసి హీరోలకు మేము ఇందులో తక్కువంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది.
కంటెంట్ ఉంటే? అది హీరో సినిమానా? హీరోయిన్ సినిమా నా? అన్నది ప్రేక్షకులు చూడరని... సినిమా బాగుంటే ఆదరణ దానంతటే వస్తుందని చెప్పుకొచ్చింది. తాజాగా సీనియర్ నటి కరీనా కపూర్ కూడా స్పందించింది. కథ మాత్రమే హీరో అని తామెవ్వరం కాదని అంది. స్టోరీ లేకపోతే ఎంత పెద్ద హీరోయిన్ అయినా? పేరున్న హీరోయిన్ అయినా ? థియేటర్ వరకూ వచ్చి సినిమా చూడరని అభిప్రాయపడింది. ఏ సినిమాకైనా కేవలం కథ మాత్రమే కీలకమని ..హీరో ఆ తర్వాత అవసరం పడతారని అన్నారు.
ఇంతకు ముందులా సినీ పరిశ్రమ ఇప్పుడు లేదంది. ప్రేక్షకులు ఒక సినిమా చూడాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించి థియేటర్ కి వస్తున్నారని..ఓటీటీలో చందా దారునిగా చేరాలనన్నా? చాలా లెక్కలేసురకుని చేరుతున్నారని...అంత నాలెడ్జ్ తో ఉంటున్నారు. 'ది క్రూ' కి అలా కుదిరింది కాబట్టే అంత పెద్ద విజయం సాధించింది. `హీరో..హీరోయిన్ ఉన్నారని ఏ సినిమా ఆడదు. అందులో కథ..కథనాలతో పాటు.. పాత్రలు బలంగా ఉండాలి.
ఎలాంటి కథకైనా ఇది ఎంతో కీలకం. కథ బాగుండి సినిమా ప్లాప్ అయిందంటే? దాన్ని దురదృష్టమనాలి చెప్పా అంతకు మించి వేరే కారణాలు వెతక్కూడదు. వెతికితే ఎవరికి వారు తప్పుగానే కనిపిస్తారు. ఆ సమయంలో తప్పును ఎదుట వారిపై వేసే అవకాశం ఉంటుంది. తన కారణంగా సినిమా పోయిందనే విషయాన్ని ఎంతో బ్యాలెన్స్ గా తీసుకోగలగాలి. అదే తర్వాత విజయానికి నాందిగా మలుస్తుంది` అని అన్నారు.