ఆ సీక్వెల్ స్టోరీపై న‌రాలు తెగే ఉత్కంఠ‌!

కోలీవుడ్ స్టార్ కార్తీ స్టోరీల ఎంపిక గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కార్తీ ఎంపిక‌లు యూనిక్ గా ఉంటాయి.

Update: 2024-01-29 13:30 GMT

కోలీవుడ్ స్టార్ కార్తీ స్టోరీల ఎంపిక గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కార్తీ ఎంపిక‌లు యూనిక్ గా ఉంటాయి. వాటిలో కార్తీ పాత్ర సైతం అంతే ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. ఛాలెంజింగ్ రోల్స్ కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాడు. కార్తీలో ఉన్న గొప్ప క్వాలిటీ అది. ముఖ్యంగా కాఫ్ రోల్స్ లో క‌ట్టిపడేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. భారీ క‌టౌట్ కాక‌పోయినా పెర్పార్మెన్స్ తో మెప్పించ‌డం కార్తీ స్టైల్. స్పై థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో కార్తీ-మిత్ర‌న్ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `స‌ర్దార్` కోలీవుడ్ లో మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

తెలుగులో పెద్ద‌గా రీచ్ అవ్వ‌లేదు గానీ...అక్క‌డ మాత్రం మంచి ఫ‌లితాలే సాధించింది. 100 కోట్ల‌కు పైగానే వ‌సూళ్లు సాధించింది. ఇక ఈసినిమాకి సీక్వెల్ ఉంటుంద‌ని కూడా తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదిగో పులి అదిగో తోక అన్న చందంగా ఈ సినిమా సీక్వెల్ ప్ర‌చారం కూడా సాగింది. కానీ ఇంత‌వ‌ర‌కూ అది జ‌ర‌గ‌లేదు. తాజాగా `స‌ర్దార్ -2` సైలెంట్ గా లాంచ్ చేసే ప‌నిలో కార్తీ అండ్ కో బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 2న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌కు ముహూర్తం సెట్ చేసిన‌ట్లు వినిపిస్తుంది.

అదే రోజు సినిమాలో న‌టీన‌టులు ఎవ‌రు? అన్ని వివ‌రాలు అధికారికంగా వెల్లడించ‌నున్నారుట‌. అయితే సంగీత ద‌ర్శ‌కుడి గా యువ‌న్ శంక‌ర్ రాజాని ఫైన‌ల్ చేసారుట‌. తొలి భాగానికి జి.వి ప్ర‌కాష్ సంగీతం అందించ‌గా ఇప్పుడ‌త‌న్ని త‌ప్పించి ఆయ‌న స్థానంలో యువ‌న్ ని తెర‌పైకి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక సీక్వెల్ స‌ర్దార్ ని మించి ఉంటుంద‌ని..ట్విస్టులు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉటాయంటున్నారు.

అలాగే ఈ సినిమా కోసం భారీ బ‌డ్జెట్ కేటాయించిన‌ట్లు స‌మాచారం. ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారుట‌. ఇండియ‌న్ స్పై థ్రిల్ల‌ర్ లో `స‌ర్దార్` ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. 1980 లో ఇండియ‌న్ ఇంటిలిజెన్స్ దేశం భ‌ద్ర‌త కోసం ఓ గుఢాచారిని త‌యారు చేసింది. అందుకోసం ఓ రంగ‌స్థ‌లం న‌టుడ్ని గుఢ‌చారిగా త‌యారు చేసి ఆప‌రేష‌న్ లోకి దించారు. ఆ క‌థ‌నే స‌ర్దార్ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో సీక్వెల్ ఎలాంటి క‌థాంశంతో వ‌స్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.





 


Tags:    

Similar News