ఎవరినీ కించపరచాలని ఈ సినిమా తీయలేదు.. కార్తీకేయ

కాగా, ఈ సినిమాతో కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. శివ అనే పాత్రలో నటిస్తున్నాడు.

Update: 2023-08-22 12:32 GMT

ఆర్ఎక్స్ 100 మూవీతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టాడు కార్తీకేయ. మొదటి సినిమా సక్సెస్ కావడంతో , అతని కెరీర్ కి ఇక తిరుగులేదు అనే అందరూ అనుకున్నారు. కానీ, ఆ మూవీ తర్వాత చాలా సినిమాలు చేసినా, ఆ రేంజ్ సక్సెస్ సాధించలేకపోయాడు. విలన్ కూడా ప్రయత్నించాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడు బెదరులంక 2012 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

ఈ బెదరులంక 2012 సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాతో కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. శివ అనే పాత్రలో నటిస్తున్నాడు. క్లాక్స్ దర్శకత్వం వహించారు. కాగా, తన చుట్టూ జరుగుతున్న మోసాలను అరికట్టే పాత్రలో ఆయనలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.

ఈ కథ 2012లో యుగాంతం వస్తుందని చాలా మంది నమ్మారు. ఆ సమయంలో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని నమ్మి చాలా మంది చాలా పనులు చేశారు. అయితే, బెదరులంక అనే గ్రామంలో కొందరు దేవుడి పేరు చెప్పి, ప్రజలను ఎలా మోసం చేశారు..? వారి ఆటలను హీరో ఎలా అరికట్టాడు అనేది ఈ మూవీ కథ. మొత్తం మూడు వారాల వ్యవధిలో జరిగిన కథగా దీనిని చూపించనున్నారు.

సినిమాలో కామెడీ అంతా చాలా ఆర్గానిక్ గా ఉంటుందని, కావాలని చొప్పించనట్లుగా ఉండదని కార్తీకేయ తెలిపారు. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా తనకీ, నేహా శెట్టి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. డీజే టిల్లు రాధిక పాత్రతో అసలు సంబంధమే ఉండదని, చాలా డిఫరెంట్ గా నేహా పాత్ర ఉంటుందన్నారు.

సినిమాలో ని కొన్ని సీన్లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని, వారిని ఆలోచించప చేసేలా ఉంటుందని అన్నారు. మత పరమైన సన్నివేశాలు ఉంటాయని, అయితే, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయలేదని కార్తీకేయ తెలిపారు. మరి ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ కథ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో తెలియాలంటే, మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News