ఏషియన్ సురేష్ తో కార్తి సినిమా.. దేవరతో బిగ్ ఫైట్!

అయితే కార్తీ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Update: 2024-08-23 11:54 GMT

కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ, అరవింద స్వామికి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మెయ్యళగన్ (Meiyazhagan). బ్లాక్ బస్టర్ మూవీ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్.సీ దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్షన్ మాత్రమే కాకుండా.. కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగులు కూడా అందిస్తున్నారు. 2డీ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.


అయితే కార్తీ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో అర‌వింద్ స్వామి సైకిల్‌ తొక్కుతుండగా.. కార్తీ వెనుక కూర్చుని హాయిగా నవ్వుతున్నారు. మరో పోస్ట‌ర్‌లో కార్తీ ఎద్దును పట్టుకున్నారు. స్నేహం కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్లు క్లియర్ గా అర్థమైంది. పోస్టర్స్ మంచి రెస్సాన్స్ అందుకున్నాయి. మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 27న విడుదలవ్వనున్నట్లు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపిన మేకర్స్.. తమిళ అండ్ ఇంగ్లీష్ పోస్టర్స్ ను విడుదల చేశారు. టాలీవుడ్ వెర్షన్ రిలీజ్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మేకర్స్.. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. టైటిల్ ను త్వరలోనే చెబుతామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

మెయ్యళగన్ మూవీలో రాజ్‌ కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచెల్ రెబెక్కా, ఆంథోనీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గోవింద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కుంభకోణం, శివగంగైలోని అద్భుతమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపారు మేకర్స్. ప్రస్తుతం ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

అయితే సెప్టెంబర్ 27వ తేదీన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల తారక్ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో దసరా సందర్భంగా బిగ్ ఫైట్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి దేవర, మెయ్యళగన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఎలా అలరిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News