యువ హీరోతో శ్రీలీల.. లవ్ హింట్ ఇచ్చిన తల్లి?

ఇటీవల బాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకున్న శ్రీలీల మంచి క్రేజ్ అందుకోవాలని చూస్తోంది. అయితే కార్తిక్ - శ్రీలీల జంటగా త్వరలో ఓ బాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నారు.;

Update: 2025-03-12 08:22 GMT

సినిమా ఇండస్ట్రీలో సహజంగానే సహ నటీనటుల మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడుతుంది. ఒకే సినిమాలో కలిసి పనిచేసే సమయంలో గాఢమైన స్నేహం ఏర్పడటమో, అంతకుమించి సంబంధం కొనసాగించటమో తరచుగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల మధ్య అలాంటి ప్రత్యేకమైన రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.

ఇటీవల బాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకున్న శ్రీలీల మంచి క్రేజ్ అందుకోవాలని చూస్తోంది. అయితే కార్తిక్ - శ్రీలీల జంటగా త్వరలో ఓ బాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నారు. సంగీత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తుండగా, T సిరీస్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. ఆసక్తికరంగా, ఈ సినిమా ప్రముఖ హిట్ ఫ్రాంచైజీ ఆశికీ లో భాగం కావచ్చని వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ క్రమంలో ఇద్దరు క్లోజ్ అయినట్లు బాలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఇది కేవలం సహజనటుల మధ్యా ఉన్న ఫ్రెండ్షిప్పా లేక నిజంగా డేటింగ్‌లో ఉన్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ రూమర్స్‌కు బలమైన కారణం కార్తిక్ ఆర్యన్ తల్లి ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్.

‘ఐఫా’ అవార్డ్స్ సందర్భంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, కార్తిక్ తల్లి మాలా తివారీని తన కొడుకు గురించి ప్రశ్నించారు. ఎలాంటి కోడలు కావాలి అని అడగడంతో.. ఆమె "మా ఇంటికి మంచి డాక్టర్ చదువుకున్న అమ్మాయి కోడలిగా రావాలి.. అని కోరుకుంటున్నాను" అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం వినగానే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చర్చ మొదలైంది.

ఎందుకంటే, శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోన్న విషయం అందరికీ తెలిసిందే. గుంటూరు కారం షూటింగ్ సమయంలో ఆమె పరీక్షలకు కూడా హాజరయ్యారు. దీంతో కార్తిక్ తల్లి ఈ కామెంట్ శ్రీలీలను ఉద్దేశించిందా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గతంలో కార్తిక్ కుటుంబం ఓ ప్రైవేట్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకుంది. ఈ ఫ్యామిలీ ఈవెంట్‌లో శ్రీలీల కూడా పాల్గొని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇలాంటి సందర్భాలు ఒకరి గురించి మరొకరికి దగ్గరయ్యే అవకాశం కల్పిస్తాయి. కార్తిక్ ఫ్యామిలీ సెలబ్రేషన్‌లో శ్రీలీల ప్రత్యేకంగా హాజరవడం ఈ వార్తలపై మరింత డౌట్స్ క్రియేట్ చేసేలా మారాయి. ఇక సినిమా పరంగా చూస్తే, ఒకవేళ వీరి సినిమా ఆశికీ 3 అయితే, కార్తిక్ - శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే, ఈ ఫ్రాంచైజీ గత చిత్రాలు ప్రేక్షకులను భావోద్వేగాలకు లోను చేసినవి. మొత్తానికి, ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు. కానీ బాలీవుడ్, టాలీవుడ్ సినీప్రేమికులు మాత్రం ఈ జోడీపై ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News