పొట్ట కరిగించి 6-ప్యాక్.. 39 నుంచి 7శాతానికి తగ్గించిన హీరో..
కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న చందు చాంపియన్ తొలి నుంచి మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.
కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న చందు చాంపియన్ తొలి నుంచి మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. దీనికి కారణం అతడి మేకోవర్. అతడి కొత్త లుక్. అతడి కఠోర శ్రమ. ఇప్పుడు `చందు ఛాంపియన్` విడుదల కోసం ఎదురుచూస్తున్న కార్తీక్ ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫిట్‌నెస్ ప్రయాణానికి సంబంధించిన కష్టాన్ని డాక్యుమెంట్ చేస్తున్నాడు. కార్తీక్ ఈ చిత్రంలో అథ్లెట్ పాత్రను పోషించాడు. దీనికోసం అతడు చాలా తీవ్రంగా ప్రిపరేషన్ సాగించాడని ఫోటోలను బట్టి అర్థమవుతోంది.
సినిమా కోసమే అయినా కానీ, ఛాంపియన్‌గా నిలిచేందుకు కార్తీక్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం మాత్రమే కాదు. అతడు తన శరీర పరివర్తనకు ముందు, తరువాత ఫోటోలను షేర్ చేసాడు. కార్తిక్ తన పోస్ట్‌లో చందు చాంపియన్ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు శరీరంలో కొవ్వు 39 శాతం ఉందని రాసాడు. రెండవది పోస్ట్-ట్రాన్స్‌ఫర్మేషన్ క్లిక్ .. 39 శాతం నుండి 7 శాతానికి కొవ్వు తగ్గిన తర్వాత ఇలా మారాను! అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. నిజానికి మొదటి ఫోటోలో పొట్ట ఉబ్బి పెద్దగా కనిపిస్తోంది. కానీ అతడు జిమ్ లో తీవ్రంగా శ్రమించి ఆరు పలకలను సాధించాడు.
ఈ శరీర పరివర్తన కోసం శిక్షణ ప్రక్రియ గురించి వివరిస్తూ కార్తీక్ ఆర్యన్ ఇలా రాసాడు. నిద్రలేమి నుండి ఫిట్‌నెస్ ఔత్సాహికుడుగా మారడం వరకు మొత్తం ప్రయాణాన్ని ఆస్వాధించాను. ఒకటిన్నర సంవత్సరాల ప్రయాణమిది. లివింగ్ లెజెండ్ మిస్టర్ మురళీకాంత్ పేట్కర్ నన్ను బలమైన మనిషిని చేయడమే కాకుండా ``కలలు కనగలిగితే దానిని సాధించగలమనే నమ్మకాన్ని మరింతగా పెంచారు. అసాధ్యం అనేది ఏదీ లేదు`` అని కార్తీక్ ఆర్యన్ వ్యాఖ్యానించారు.
కార్తీక్ ఆర్యన్ తన పోస్ట్‌కి హాస్యాన్ని పరిహాసాన్ని జోడించాడు. మొదట్లో అమ్మ చెప్పేది.. జిమ్‌కి వెళ్లమని.. ఈ రోజుల్లో ఆమె ఫోన్ చేసి చెప్పాలి.. దయచేసి జిమ్ నుండి తిరిగి రండి అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇది అతడి జిమ్ అడిక్షన్ ని తెలియజేస్తోంది. స్పోర్ట్స్ డ్రామా చందు ఛాంపియన్‌కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 14న థియేటర్లలోకి రానుంది.