కార్తికేయ హిట్ లాజిక్ పట్టేస్తాడా..?

యువ హీరోల్లో ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అనేలా వారు చూపిస్తున్న ఉత్సాహం పరిశ్రమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు

Update: 2023-08-29 05:38 GMT

యువ హీరోల్లో ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అనేలా వారు చూపిస్తున్న ఉత్సాహం పరిశ్రమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. హీరోనా విలనా కాదు పాత్రకు న్యాయం చేస్తున్నామా లేదా అన్న లెక్కలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోల్లో సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న వారిలో కార్తికేయ ఒకరు. ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి అందుకోలేదు.

లేటెస్ట్ గా బెదురులంక 2012 సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు కార్తికేయ. క్లాక్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంది. పోటీగా వచ్చిన వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున నిరాశపరచడంతో కార్తికేయ బెదురులంకకి ప్లస్ అయ్యింది. అలా కార్తికేయ ఖాతాలో ఒక సూపర్ హిట్ సినిమా పడింది. ఆరెక్స్ 100 తర్వాత హిప్పీ, గుణ 369, 90ML, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క సినిమాలు చేసిన కార్తికేయ విలన్ గా కూడా నాని గ్యాంగ్ లీడర్, అజిత్ వలిమై సినిమాల్లో నటించాడు.

ఆ సినిమాలేవి కార్తికేయకు సక్సెస్ ఇవ్వలేదు. అయితే బెదురులంక సినిమా మాత్రం గ్యాప్ తీసుకుని మరీ కరెక్ట్ టైమింగ్ లో వదలగా ఆ సినిమా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 2012 యుగాంతం బ్యాక్ డ్రాప్ లో బెదురులంక ఊరులో జరిగే సంఘటనలతో సెకండ్ హాఫ్ కామెడీతో సినిమా ని నిలబెట్టాడు డైరెక్టర్. కార్తికేయ కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో కార్తికేయ ఇక మీదట కూడా డిఫరెంట్ కథల్తో కామెడీ టచ్ ఇస్తూ ఎంటర్టైనింగ్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. తప్పకుండా కార్తికేయకు ఈ బూస్టింగ్ అతని కెరీర్ సెట్ రైట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కార్తికేయ రాబోయే సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త పడితే యువ హీరోల్లో అతనికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. 2018 లో ఆరెక్స్ 100 రాగా హిట్ కొట్టేందుకు నాలుగు ఏళ్లు.. 7 సినిమాలు గ్యాప్ వచ్చింది. కథల విషయంలో మరింత ఫోకస్ తో ఉంటూ కెరీర్ ప్లాన్ చేస్తే బెటర్ అని ఆడియన్స్ భావిస్తున్నారు. హిట్ ఇచ్చే జోష్ వేరేలా ఉంటుంది. కార్తికేయ బెదురులంక సక్సెస్ అతనికి మంచి కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News