‘క్షమాపణలు కోరినా చర్యలు తప్పవు’... కస్తూరి వ్యాఖ్యల వ్యవహారంపై కీలక అప్ డేట్!

సినీ నటి కస్తూరి ఈ నెల 3న తెలుగు ప్రజలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-06 04:29 GMT

సినీ నటి కస్తూరి ఈ నెల 3న తెలుగు ప్రజలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కస్తూరి చేసిన వ్యాఖ్యలపై అటు తెలుగు, ఇటు తమిళ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో ఆమెపై పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

అవును... తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి క్షమాపణలు చెప్పారు. తాను మాట్లాడింది కొందరి గురించేనని, తెలుగు ప్రజలందరినీ కాదని చెప్పుకొచ్చారు. మరోపక్క ఆమెపై భారీ వరుసగా కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. మరోపక్క డీఎంకే నేతలు.. కస్తూరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా... నటి కస్తూరి వ్యాఖ్యలు తెలుగువారినే కాకుండా మొత్తం మహిళలనూ కించపరిచేలా ఉన్నాయని డీఎంకే ఎంపీ రాజా ఆరోపించారు. బ్రాహ్మణుల సమాజం అణిచివేతకు గురవుతుందనే పేరిట జరిగిన ఆందోళనల్లో మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఆమె పెరియార్, కరుణానిధి, మొదలైన వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు.

ఇదే సమయంలో... బ్రాహ్మణుల పరిరక్షణ డిమాండ్ ముసుగులో డీఎంకే ప్రభుత్వంపై బురద జల్లాలని వ్యూహరచన చేశారని ఆమె ఆరోపించారు. గతంలో... బ్రాహ్మణేతరులకు పదవులు ఇస్తే లంచాలు తీసుకుంటారని టీవీ ఛర్చా వేదికల్లోనూ ఆమె చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నారు. విద్వేషం పేరిట రాజకీయ లబ్ధి పోందాలని ప్రయత్నిస్తే అది సక్సెస్ కాదని తెలిపారు.

మరోపక్క... కస్తూరిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమిళర మున్నేట్ర పడై అధ్యక్షురాలు వీరలక్ష్మి ఫిర్యాదు చేశారు. తమిళనాడులో ఉంటున్న తెలుగు మాట్లాడే ప్రజలకు, తమిళలులకు మధ్య ఘర్షణ ప్రేరేపించేలా ఆమె వ్యవహరిస్తున్నారని అన్నారు. సినిమాలు, రాజకీయాల్లో ఛాన్స్ ల కోసమే కస్తూరి ఇలా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు.

ఇదే సమయంలో... తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) డిమాండ్ చేసింది. ఇదే సమయంలో సమాఖ్య తరుపున ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె క్షమాపణలు కోరినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ విధంగా కస్తూరిపై పలు తెలుగు, తమిళ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. భారీ నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించాయి.

Tags:    

Similar News