మ‌న్మ‌ధుడు గురించి న‌టి మ‌న‌సులో మాట‌!

ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కంటే త‌మిళ సినిమాలే ఎక్కువ‌గా చేస్తున్నారు.

Update: 2024-03-21 12:30 GMT

90స్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వెట‌ర‌న్ న‌టి క‌స్తూరి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ లో ఎన్నో సినిమాల్లో న‌టించారు. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తిం పును ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సినిమాల‌తో పాటు టీవీ సీరియ‌ళ్ల‌లోనూ న‌టిస్తున్నారు. `ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ తో తెలుగు నాట మ‌రింత ఫేమ‌స్ అయ్యారు.

ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కంటే త‌మిళ సినిమాలే ఎక్కువ‌గా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సీనియ‌ర్ న‌టి కింగ్ నాగార్జున తో త‌న‌కున్న ప‌రిచ‌యం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆవేంటో ఆమె మాట్లోల‌నే.. `నేను స్కూల్లో చదువుకునే రోజుల నుంచి కూడా నాగార్జునగారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ రోజుల్లోనే నాగార్జునగారిని ఒకసారి కలిశాను. అప్పుడు ఆయన ఏ షర్టు వేసుకున్నదీ ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది.

ఆయనకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆయన టచ్ చేసిన చేతితో నేను ఏమీ తాకకుండా స్కూల్ కి వెళ్లి మా ఫ్రెండ్స్ కి చూపించాను. నాగార్జునగారు టచ్ చేసిన చేయి అంటూ అంతా టచ్ చేసేవారు. నాగార్జున గారు అంటే ఇప్పటికీ నాకు అదే ఇష్టం ఉంది. ఆయ‌న న‌ట‌న‌కు వీరాభిమానిని. ఆయ‌న సినిమాలేవి మిస్ అవ్వ‌కుండా చూస్తాను. ఇప్ప‌టికీ అదే అదే అల‌వాటు ఉంటుంది. నాగార్జున గారి సినిమా అంటే చూడనిది అంటూ ఉండ‌దు` అన్నారు.

అలాగే క‌మ‌ల్ హాస‌న్ గురించి మాట్లాడుతూ... `శంక‌ర్..రెహ‌మాన్..క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో సినిమా అంటే ఎవ‌రు వ‌దులుకుంటారు. కమల్ హాసన్ గురించి ఏం చెప్పమం టారు? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే` అని అన్నారు. క‌స్తూరి తెలుగులో 1992 లో `గ్యాంగ్ వార్` అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత `నిప్పుర‌వ్వ` .. `గాడ్ ఫాద‌ర్` లోనూ న‌టించారు.

Tags:    

Similar News