మహా కుంభ్ 2025: హీరోయిన్‌పై ప‌డ్డ జ‌నం

ప్రయాగ్‌రాజ్‌లో `మహా కుంభ్ 2025` మేళాను చాలామంది సెల‌బ్రిటీలు సందర్శించారు.

Update: 2025-02-26 08:35 GMT

ప్రయాగ్‌రాజ్‌లో `మహా కుంభ్ 2025` మేళాను చాలామంది సెల‌బ్రిటీలు సందర్శించారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్న బాలీవుడ్ క‌థానాయిక‌ క‌త్రిన కైఫ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర స్నానం చేస్తుండగా క‌త్రిన‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రజలు త‌న‌ను ఎలా చుట్టుముట్టారో డ్రోన్ వీడియోలో హైలైట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

వైరల్ వీడియోలో కత్రినా కైఫ్ తన కుటుంబంతో కలిసి మహా కుంభ్‌కు రావ‌డాన్ని చూడవచ్చు. క‌త్రిన‌ నారింజ రంగు దుస్తులు ధరించి కనిపిస్తుంది. క్యాట్‌తో పాటు అత్తగారు, కొంతమంది పూజారులు, అంగరక్షకులు ఉన్నారు. అయితే ఆ స‌మ‌యంలో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రజలు త‌న చుట్టూ గుమిగూడారు. కొంతమంది మీడియా వ్యక్తులు కూడా మైక్ ప‌ట్టుకుని జనంలోకి ప్రవేశించారు. ఇద్దరు మ‌గ‌పుంగ‌వులు క‌త్రిన‌ భుజంపై తువ్వాలు వేశారు.

త్రివేణి సంగమానికి వీఐపీలు వచ్చినా కానీ, కత్రినా కైఫ్ పూజలాచ‌రించేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మహా కుంభ్- 2025 లో పవిత్ర స్నానం చేయడానికి క‌త్రిన‌ ఇబ్బంది పడుతుండటం చూసిన తర్వాత నెటిజనులు కూడా వీఐపీ సంస్కృతిని సమర్థించారు. ఒక నెటిజ‌న్ ఇలా రాశారు. ``వీఐపీ సంస్కృతి ఎందుకు ఉంది.. ఎందుకు ఉండాలి? అనేదానికి కారణం ఇదే`` అని రాసారు.

ఆమె చుట్టూ చాలా మంది గుంపు...ఆమెను శాంతియుతంగా పవిత్ర స్నానం చేయనివ్వండి.... చూస్తుంటేనే ఊపిరి ఆడటం లేదు..! అని మరో నెటిజన్ అన్నారు. వీఐపీ సంస్కృతి గురించి ఏడ్చేవాళ్ల‌కు జ్ఞానం రావాలి! అని రాసారు. చావా ప్రమోషన్ల సమయంలో మహా కుంభ్‌ను క‌త్రిన‌- విక్కీ జంట‌ సందర్శించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వ‌సూళ్ల‌ను సాధించింది. `చావా` చూసిన తర్వాత కత్రినా కూడా విక్కీతో ఉత్సాహంగా క‌నిపించింది. కత్రినా కైఫ్ తదుపరి ఫర్హాన్ అక్తర్ `జీ లే జరా`లో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్, అలియా భట్ కూడా కీలక పాత్రల్లో నటించారు. కత్రినా చివరి చిత్రం `మెర్రీ క్రిస్మస్` విమర్శకులు, ప్రజల నుండి చాలా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

Full View
Tags:    

Similar News