'ముసలి హీరోలతో నటించనని చెప్పేశా'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ఈ సందర్భంగా 'ముసలి హీరోలతో నటించను' అన్నారంట కదా? అని యాంకర్ ప్రశ్నించగా.. "నేను అలా అనలేదు. ఇదంతా ట్విస్టింగ్ టర్నింగ్ అవుతోంది" అని కావ్య సమాధానమిచ్చింది.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మలలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. 'మసూద' మూవీతో లీడ్ యాక్ట్రెస్ గా పరిచయమైన ఈ తెలుగు బ్యూటీ.. 'బలగం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ముసలి హీరోల పక్కన యాక్ట్ చెయ్యను అని కావ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చింది.
కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్టుగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా 'ముసలి హీరోలతో నటించను' అన్నారంట కదా? అని యాంకర్ ప్రశ్నించగా.. "నేను అలా అనలేదు. ఇదంతా ట్విస్టింగ్ టర్నింగ్ అవుతోంది" అని కావ్య సమాధానమిచ్చింది. అల్లు అర్జున్, బాలయ్య సినిమాలలో బాలనటిగా నటిస్తున్నప్పుడు, పెద్దయ్యాక తమ పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేయమని సరదాగా అడిగేవారని చెప్పింది. అయితే చిన్నతనంలో ఏదో తెలియక ముసలి వాళ్ళతో యాక్ట్ చేయనని అన్నానని చెప్పింది.
"చిన్నప్పుడు నేను అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారితో సినిమాలు చేశాను. ఆ సమయంలో 'నువ్వు ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తున్నావ్. పెద్దగా అయిన తర్వాత మా పక్కన హీరోయిన్ గా చెయ్యాలి' అని నాతో జోక్ గా అన్నారు. అప్పుడు నేను చిన్న పిల్లని కదా. నాకు ఏమీ తెలియక 'నేను హీరోయిన్ అయ్యే టైముకి మీరు ముసలి వాళ్ళు అయిపోతారు. కాబట్టి నేను మీతో చెయ్యను' అని చెప్పాను. కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ గారు గ్లోబల్ ఐకాన్. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడానికి నేను చచ్చిపోతున్నాను" అని కావ్య తెలిపింది.
అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన 'గంగోత్రి' సినిమాలో కావ్య కల్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. "గంగోత్రి నుంచి పుష్ప వరకూ అల్లు అర్జున్ జర్నీ ఎంతో ఇన్స్పిరేషన్. సినిమా సినిమాకీ ఆయన ఇంప్రూవ్ అవుతూ ఈ స్థాయికి వచ్చారు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎక్కడా స్తబ్దుగా ఉండలేదు. ప్రతీ సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఏదో కొత్తగా ఇవ్వాలనే తాపత్రయ పడుతుంటారు" అని కావ్య చెప్పింది.
"ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారు కానీ, నేను పూణేలో చదువుకుంటున్నప్పుడు 'బాహుబలి', 'పుష్ప' సినిమాలు రాకముందే అల్లు అర్జున్ ని అక్కడ అందరూ గుర్తు పట్టేవారు. అప్పుడే ఆయన డబ్బింగ్ సినిమాలను హిందీ, మలయాళీ జనాలు తెగ చూసేవారు" అని కావ్య తెలిపింది. 'గంగోత్రి' సినిమా టైంలో అల్లు అర్జున్ తో చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది. అరకులో షూటింగ్ జరుగుతున్నప్పుడు బన్నీ, అదితి అగర్వాల్, తేజతో కలిసి చెరకు తోటలకు వెళ్ళామని తెలిపింది. గంగోత్రి సినిమాకి కూడా బన్నీ ఫుల్ డెడికేషన్ తో వర్క్ చేశారని కావ్య చెప్పింది.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. అంత పెద్ద స్టార్స్ అయినా సెట్స్ లో చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళని కావ్య చెప్పుకొచ్చింది. 'స్నేహమంటే ఇదేరా' సినిమాతో బాలనటిగా పరిచయమైన కావ్య రామ్.. 'గంగోత్రి', 'ఠాగూర్', 'అడవి రాముడు', 'బాలు', 'బన్నీ', 'లేత మనసులు', 'విజయేంద్ర వర్మ', 'సుభాష్ చంద్రబోస్', 'పాండు రంగడు', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' తదితర సినిమాలతో పేరు తెచ్చుకుంది. 2022లో 'మసూద'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బలగం', 'ఉస్తాద్' సినిమాలలో నటించింది.