కూల్ గా కనిపిస్తూనే హీటెక్కించిన కావ్య పాప!
ఈ ఫోటోలలో కావ్య థాపర్ ఒక క్యూట్ క్యాట్ తో పసందైన క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించింది. ఆమె చేతిలో కూర్చున్న క్యాట్ ఫోటోలో ఆమె సున్నితమైన ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేసింది.
గ్లామరస్ బ్యూటీ కావ్య థాపర్ ఈ మధ్య తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వైట్ అవుట్‌ఫిట్ ఫోటోలతో ఆమె మరోసారి అందరినీ ఆకట్టుకుంది. బాలీ, ఇండోనేషియా బ్యాక్‌డ్రాప్‌లో ఆమె ఫోటోలు టోటల్ క్లాసిక్ లుక్‌ను ప్రదర్శించాయి. "ఈ సాయంత్రపు ప్రశాంతత, ప్రేమతో నిండిన అనుభవం మరచిపోలేను" అంటూ ఆమె తన అభిమానులకు తన కొత్త లుక్‌ను పరిచయం చేసింది.
ఈ ఫోటోలలో కావ్య థాపర్ ఒక క్యూట్ క్యాట్ తో పసందైన క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించింది. ఆమె చేతిలో కూర్చున్న క్యాట్ ఫోటోలో ఆమె సున్నితమైన ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేసింది. వైట్ అవుట్‌ఫిట్‌లో ఆమె ఎంతో అందంగా మెరిసిపోతోంది. సహజమైన చిరునవ్వుతో కావ్య అందాలను మరింత మెరుగు పరచడం ఫ్యాన్స్‌కి కనుల విందుగా మారింది. ప్రకృతి చుట్టూ ఉన్న బ్యాక్‌డ్రాప్ ఈ ఫోటోల ఆకర్షణను మరింత పెంచింది.
ఇక కావ్య థాపర్ టాలీవుడ్‌లో వరుసగా కమర్షియల్ మూవీస్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుతోంది. అయితే ఈ ఏడాది ఆమె నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్స్ అయినప్పటికీ ఆమె అందం, నటనతో ఆడియన్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షాట్‌లను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌తో మంచి బాండింగ్ ను కొనసాగిస్తూ, ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది.
వైట్ ఫ్లోయింగ్ డ్రెస్‌లో కనిపిస్తున్న కావ్య సింప్లిసిటీతో కూడిన ఎలిగెన్స్‌ని ప్రదర్శించింది. సహజత్వం క్లాసిక్ లుక్‌తో కూడిన లుక్స్ కావ్యకి ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చాయి అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె ట్రెడిషనల్ లుక్స్‌తో కూడిన సినిమాలు చేస్తే మరింత ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా అమ్మడు డబుల్ ఇస్మార్ట్, విశ్వం లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ అవేమి క్లిక్కవ్వలేదు. మరి రాబోయే సినిమాలైనా అమ్మడికి మంచి సక్సెస్ ను అందిస్తాయేమో చూడాలి.