టాలీవుడ్‌కి మళ్లీ వస్తున్నా..!

తెలుగు ప్రేక్షకులకు కొన్నాళ్ల క్రితం 'అల్లూరి' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కయాదు లోహర్‌. ఈ అమ్మడు ఆ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకోలేక పోయింది.

Update: 2025-02-27 05:35 GMT

తెలుగు ప్రేక్షకులకు కొన్నాళ్ల క్రితం 'అల్లూరి' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కయాదు లోహర్‌. ఈ అమ్మడు ఆ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో కయాదు లోహర్‌కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. దాంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడు ఆ తర్వాత ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకున్న కయాదు ఇటీవల డ్రాగన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రదీప్ రంగనాథ్‌ హీరోగా రూపొందిన డ్రాగన్‌ సినిమా తెలుగులోనూ విడుదల అయింది. రిటర్న్‌ ఆఫ్ ది డ్రాగన్‌ పేరుతో విడుదలైన డ్రాగన్‌ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

డ్రాగన్‌ సినిమాలో కయాదు లోహర్‌ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ అమ్మడు తెలుగులో గతంలో ఒక సినిమా చేసింది అంటే నమ్మశక్యంగా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న ఈ అమ్మడు త్వరలో ఫంకీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగులో డ్రాగన్ సినిమాకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో తెలుగులో ఒక వీడియోను ఈమె షేర్‌ చేసింది. తెలుగు నేర్చుకుంటున్నట్లు చెప్పడంతో పాటు, తెలుగులో డ్రాగన్ సినిమాకు మంచి స్పందన ఇచ్చినందుకు గాను ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. తెలుగులో క్యూట్‌గా మాట్లాడిన ఈమె వీడియో వైరల్‌ అవుతోంది.

కయాదు లోహర్‌ తన తెలుగు రీ ఎంట్రీని కన్ఫర్మ్‌ చేసింది. త్వరలో తెలుగులో మళ్లీ వస్తున్నాను అంటూ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలతో వస్తాను అంటూ పేర్కొంది. తెలుగు నేర్చుకుని తెలుగులో నటించేందుకు సిద్ధం అవుతున్న కయాదు లోహర్‌ తెలుగులో మంచి హీరోయిన్‌గా, స్టార్‌ డం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఈ అమ్మడు నటించబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లూరి సినిమాతో నిరాశ పరచిన కయాదు లోహర్‌కి ఫంకీ సినిమా హిట్‌ ఇచ్చేనా చూడాలి.

విశ్వక్ సేన్‌ హీరోగా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందుతున్న ఫంకీ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ కయాదు లోహర్ నటిస్తున్న కారణంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఈ అమ్మడు ఫంకీ సినిమాతో హిట్‌ కొడితే మరిన్ని ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో ఈమెకు గుడ్‌ టైం నడుస్తుంది. కనుక ఫంకీ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News