హిందూ, క్రైస్త‌వ‌మ‌తాల ప్ర‌కారం కీర్తి సురేష్ పెళ్లి

న‌టి కీర్తి సురేష్ చిన్న‌నాటి స్నేహితుడు ఆంటోనీ త‌ట్టిల్ ని వివాహం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-02 08:26 GMT

న‌టి కీర్తి సురేష్ చిన్న‌నాటి స్నేహితుడు ఆంటోనీ త‌ట్టిల్ ని వివాహం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. 15 ఏళ్ల ప్రేమ‌కు వివాహ బంధంతో పుల్ స్టాప్ పెడ‌తున్నారు. డిసెంబ‌ర్ 11, 12 తేదీల్లో గోవాలో ఈ వివాహం జ‌రుగుతంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి. ఇటీవ‌లే కీర్తి సురేష్ తిరుమ‌ల శ్రీవారిని కూడా ద‌ర్శిం చుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి నేప‌థ్యంలోనే ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ట్లు కీర్తి తెలిపింది.

తాజాగా ఈ వివాహం రెండు సంప్ర‌దాయాల ప్ర‌కారం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. హిందూ, క్రైస్త‌వ మ‌తాల ప్రకారం వివాహం జ‌రుగుతుంది. మూడు రోజుల వివాహ వేడుక కార్య‌క్ర‌మంలో భాగంగా 10న ప్రీవెడ్డింగ్, 11న సంగీత్ వేడుక నిర్వ‌హిస్తున్నారు. 12వ తేదిన వివాహం జ‌రుగుతుంది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం కీర్తి మెడ‌లో ఆంటోనీ త‌ట్టిల్ మూడు మూడులు వేస్తాడు. ఇది ఉద‌యం జ‌రిగే పెళ్లి.

అదే రోజు సాయంత్రం గోవాలోని స్థానిక చ‌ర్చిలో క్రైస్త‌వ మ‌తం ప్ర‌కారం మ‌రో వెడ్డింగ్ జ‌రుతుంది. ఈ వివాహ కార్య‌క్ర‌మం ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో జ‌రుగుతుంది. అతి కొద్ది మంది స‌న్నిహితులు, స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌వుతారు. ఇప్ప‌టికే కీర్తి సురేష్ పెళ్లి ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. ప్ర‌స్తుతం ఆమె కేర‌ళ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఆంటోనీ త‌ట్టిల్ కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన వ్య‌క్తి. కేరళలోని ప్రముఖ రిసార్ట్ చెయిన్ కు ఓనర్. కీర్తితో అత‌డి ల‌వ్ స్కూల్ డేస్ నుంచి మొదలైందని కొన్ని క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. ఇక కీర్తి న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే ఆమె న‌టించిన హిందీ చిత్రం బేబి జాన్ రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News