కరోనా సమయంలోనే ఒకే ఇంట్లో కీర్తి-ఆంటోనీ!
కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిల్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ-క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వేడుక జరిగింది.
కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిల్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ-క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వేడుక జరిగింది. కీర్తి సురేష్ హిందువు కాగా, ఆంటోనీ క్రైస్తవ మతస్తుడు కావడంతోనే రెండు సంప్రదా యాలా ప్రకారం వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరిది ప్రేమ వివాహం. ఆంటోనీ చిన్న నాటి స్నేహితుడు. అతడితోనే జీవితాన్ని పంచుకుంటే? బాగుంటుందని భావించి కీర్తి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.
అయితే రెండు పద్దతుల్లో పెళ్లి అనేసరికి చిన్నపాటి విమర్శలొస్తాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ సైతం క్రైస్తవ మతాచారం ప్రకారం పెళ్లికి తన తండ్రి ఒప్పుకుంటాడో? లేదోనని సందేహం వ్యక్తం చేసింది. కానీ తండ్రి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా క్రైస్తవ పద్దతిలోనూ పెళ్లికి అంగీకరించినట్లు తెలిపింది. తన తండ్రి నుంచి ఆ రకమైన రియాక్షన్ చూసి షాక్ అయ్యానని, ఏమాత్రం ఊహించలేకపోయాను` అని అంది.
అలాగే ఆంటోనీని ఇంటర్మీడియట్లో కలిసినట్లు తనకంటే ఆంటోనీ ఏడేళ్లు పెద్ద వాడు అని తెలిపింది.` ఖతర్ లో కొన్నాళ్ల పాటు వర్క్ చేసారు. ఆ సమయంలో ఆరేళ్ల పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నామంది. కరోనా సమాయానికి అది లివ్ ఇన్ రిలేషన్ షిప్ గా మారిందని తెలిపింది. కోవిడ్ టైమ్ లో ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లు పేర్కొంది.
ఇక నటిగా కీర్తి సురేష జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటలీవలే బాలీవుడ్ లో `బేబీజాన్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. పెళ్లైన తర్వాత రిలీజ్ అయిన మొట్ట మొదటి చిత్రం. కీర్తి పెళ్లి డిసెంబర్ 12న జరగగా, సినిమా అదే నెల 25న రిలీజ్ అయింది. కానీ పెళ్లైన తర్వాత తొలి సక్సెస్ నమోదు చేస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం కోలీవుడ్ లో `రివాల్వర్ రీటా`, `కన్నైవెడి `చిత్రాల్లో నటిస్తోంది.